రాష్ట్రంలో పేదరికం నిర్మూలన
చంద్రబాబుతోనే సాధ్యం
న్యూస్ తెలుగు /వినుకొండ : రాష్ట్రంలో పేదరికం నిర్మూలన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన పీ4 విధానంతోనే సాధ్యం అని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. పేదరికం లేని రాష్ట్రాన్ని సాధించి చూపిస్తామని ఎన్నికలకు ముందే హామీ ఇచ్చామని, ఇప్పుడు ఆ దిశగానే కూటమి ప్రభుత్వం చర్యలు ఉండబోతున్నాయనీ ఆయన తెలిపారు. అందుకోసమే ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలూ భాగస్వామ్యులు కావాలని సీఎం పిలుపునిచ్చారని, అందుకు స్పందించి, సహకరించాల్సిన బాధ్యత కూడా అందరిపై ఉందన్నారు. రాష్ట్రాన్ని 2024 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలిపేలా ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం వెల్లడించిన ప్రజంటేషన్‌పై ఈ మేరకు స్పందించారు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. ఒక్కసారి అమరావతి పూర్తయితే ఆంధ్రప్రదేశ్‌కు అది హైదరాబాద్‌ను మించిన గ్రోత్ ఇంజిన్ అవుతుందని, దేశంలోని అతిపెద్ద మెట్రో పాలిటన్ రీజియన్‌లలో అది ఒకటిగా నిలుస్తుందన్నారు. అలాంటి ప్రజా రాజధానిని అయిదేళ్లు పాడుబెట్టిన జగన్ కారణంగా నిర్మాణ వ్యయం పెరగడం తప్ప రాష్ట్రానికి ఒరిగింది శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఊరికి ఎంతోకొంత తిరిగి ఇచ్చినవారే నిజమైన శ్రీమంతులు అవుతారని , అదేస్ఫూర్తితో ముఖ్యమంత్రి ఎవరికి తోచిన స్థాయిలో వారు గ్రామాల అభివృద్ధిలో భాగస్వా మ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. స్వర్ణాంధ్రప్రదేశ్ స్వప్నం సాకారంలో భాగంగా ప్రతికుటుంబం ఆర్థికంగా బలపడాలంటే ఉపాధి అవకాశాలు పెరగాలని, ఆ దిశగానే కూటమి ప్రభుత్వం 20లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రణాళికలు రచించించదని, ప్రైవేటురంగం నుంచి కూడా అందుకు సహకా రం లభించాల్సి ఉందన్నారు. ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో స్థిరపడిన స్థానికులు ఆ దిశగా ముం దుకు రావాలని కోరారు. (Story : రాష్ట్రంలో పేదరికం నిర్మూలన చంద్రబాబుతోనే సాధ్యం)