రాజ్యాంగ రక్షణకై అందరు పోరాడాలి
న్యూస్ తెలుగు /వినుకొండ : రాజ్యాంగ రక్షణకై అందరూ కలిసికట్టుగా పోరాడాలని స్వార్ధ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొనే భారత రాజ్యాంగాన్ని మార్చే యోచనలో దేశ హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ పై అవహేళన చేస్తూ మాట్లాడారని వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బోయపాటి. రామాంజనేయులు… కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన వామపక్షాల రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యాఖ్యానించారు. మతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ది పొందాలనే బీజేపీ స్వార్ధ రాజకీయాలు చేస్తుందని అందుకే ఢిల్లీ కాంగ్రెస్ దీనిపై జై బాపూజీ.. జై భీమ్ … జై సంవిధాన. కార్యక్రమాన్ని రూపొందిచి బిజెపిపై పోరాటం చేస్తుందని అందులో భాగంగానే రాజ్యాంగ రక్షణకై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగుదన్నారు. వామపక్షాల సలహాలు సూచనలు తీసుకొవడం జరిగిదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రెడ్డి బోయిన. ప్రసన్నకుమార్, పిడుగు. విజయ్. అడపాల శ్రీనివాసరావు షేక్. నాగూర్ భాష, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, సిపిఐ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము, సిపిఎం పార్టీ నాయకులు హనుమంత రెడ్డి, వినుకొండ నియోజకవర్గం మాల మహానాడు ఉపాధ్యక్షుడు రాయిని. చిన్న ,ఎమ్మార్పీఎస్ నాయకులు గార్లపాటి. రమేష్, బేతం. దేవానంద్, తదితరులు పాల్గొన్నారు. (Story : రాజ్యాంగ రక్షణకై అందరు పోరాడాలి)