పెద్ద సమస్యల మారిన ప్రెస్ అనే రెండు అక్షరాలు..
న్యూస్‌తెలుగు/విజయవాడ : ఫోటోగ్రాఫర్లు,కేబుల్ టీవీ ఆపరేటర్లు,పునుగులు బజ్జీలబండి, తాపీ మేస్త్రీలు ముఠామేస్త్రులు వీరంతా ప్రస్తుత మీడియాలో ఉంటూ ప్రెస్ అని తమ వాహనాలకి పెద్దపెద్ద అక్షరాలతో స్టిక్కరింగ్ లు…
పోలీసులకి మంచి అవకాశం దొరికింది, హెల్మెట్ లేని వాహనాలను తనిఖీలు చేయడం, పెండింగ్ చలానాలు కట్టించడం,లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ పోలీసు వారు స్పెషల్ డ్రైవ్ నిర్వర్తిస్తున్నారు…
ఇలాంటి సమయంలో ప్రతి వాహనాన్ని ఆపి ప్రెస్ స్టిక్కర్ వేసుకున్న ప్రతి వాహనాన్ని ఆపి,వారు ప్రింట్ మీడియా నా లేక ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన వారా అని వారి సంస్థలు ఇచ్చిన ఐడి కార్డును పరిశీలిస్తే అసలు ఎవరో నకిలీలు ఎవరు అనేది ఇలాంటి సమయంలో బయట పడతారు…
ప్రెస్ అనే వాహనాలు ఆపినప్పుడల్లా పోలీసు వారు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడితే దొంగలు బయటపడతారు..
విజయవాడ పోలీసులు ఇలా చేస్తే ఎప్పటినుంచో నకిలీల ఏరివేత కొద్దిగా గొప్ప సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వెస్ట్ జోన్ ఎసిపి కార్యాలయం పక్కన ఉన్న వన్ ట్రాఫిక్ కార్యాలయం వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తలికి తనిఖీలు చేసే సందర్భంలో ప్రెస్ అనే స్టిక్కర్ని అంటించుకుని పోలీసులను బెదిరించిన సందర్భంలో స్టూడియోలో పనిచేసే కెమెరా మాన్ ని పోలీసులు గుర్తించారు అందుకు ఈ వీడియోనే సాక్ష్యం… (Story : పెద్ద సమస్యల మారిన ప్రెస్ అనే రెండు అక్షరాలు..)