డ్రెయిన్స్ పక్క పిచ్చి మొక్కలను తొలగించండి
పారిశుద్ధ కార్మికులకు కమిషనర్ సూచన
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ పట్టణంలోని డ్రెయిన్స్ పై రోడ్లపై పిచ్చిమొక్కలు లేకుండా చర్యలు తీసుకోవాలని వినుకొండ మునిసిపల్ కమీషనర్ సుభాష్ చంద్రబోస్ మంగళవారం పలు వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి పాములకు, పురుగులకు ఆవాసముగా మారి విషపురుగులు రోడ్లపై సంచరిస్తూ ప్రాణ సంకటంగా మారిన నేపథ్యంలో రోడ్ అంచులలో మురుగు కాలువలపై ఎట్టి పరిస్థితుల్లో పిచ్చిమొక్కలు లేకుండా తమ వార్డ్ పరిధులలో పారిశుధ్య కార్మికులు గమనించి తొలగించాలని అట్లు చేయని యెడల సంబంధిత అధికారులను మేస్త్రీలను పారిశుధ్య కార్మికులను ఉపేక్షించబోమని కమీషనర్ హెచ్చరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ. తమ ఇంటి పరిసరాల్లో ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు లేకుండా చూసుకోవాలని, ఖాళీ స్థలాల యజమానుల వివరాలను మునిసిపల్ సిబ్బందికి తెలియజేసి వారిపై తీసుకొనబోవు చర్యలతో పిచ్చిమొక్కల పుప్పొడి రేణువుల ద్వారా వచ్చే అలెర్జీ సంభావ్యతను నివారించాలని పారిశుద్ధ కార్మికులకు ఖాళీ స్థలాల యజమానులు సహకరించాలని కమిషనర్ కోరారు. (Story : డ్రెయిన్స్ పక్క పిచ్చి మొక్కలను తొలగించండి)