UA-35385725-1 UA-35385725-1

పెద్ద జీతగాడిలా పని చేస్తా మెఘా మార్క్ చూపిస్తా

పెద్ద జీతగాడిలా పని చేస్తా మెఘా మార్క్ చూపిస్తా

న్యూస్‌తెలుగు/వ‌న‌ప‌ర్తి : వనపర్తి నియోజకవర్గం అభివృద్ధి కోసం తాను పెద్ద జీతగాడిలా అహర్నిశలు పనిచేసి నియోజకవర్గ అభివృద్ధిలో మెఘా మార్కును చూపిస్తానని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.
మంగళవారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 473 మంది లబ్ధిదారులకు రూ. 1,12,47,500 విలువగల CMRF చెక్కులను, 215 మంది లబ్ధిదారులకు 2,15,24,940 విలువగల కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను అందజేశారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల విలువ గల ఆరోగ్య శ్రీ పథకం, 200 యూనిట్ల విద్యుత్ ఉచితం, 500 కే వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీ, రెండు లక్షల రైతు రుణమాఫీ, లాంటి పథకాలు ఏ పార్టీకి అమలు అయ్యాయని
మరి కొద్ది రోజుల్లోనే వ్యవసాయోగ్యమైన సాగుభూమికి ప్రతి ఎకరాకు, భూమి లేని నిరుపేదలకు సైతం ఎకరాకు రూ 12000 చొప్పున అందజేయను ఉన్నామని ఆయన చెప్పారు.
మహిళలను మహారాణులను చేసేందుకు ఐదు సంవత్సరాలలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సుల కొనుగోల్ల లోను విద్యార్థులకు బట్టలు కుట్టడంలోనూ వంట చేసే కార్యక్రమాలను మహిళలను భాగస్వామ్యం చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.
వనపర్తి నియోజకవర్గంలో ఇప్పటికే 673 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఎమ్మెల్యే చెప్పారు వనపర్తి జిల్లా కేంద్రంలో ఇప్పటికీ సొంతభవనాలు లేని ప్రభుత్వ కార్యాలయాలు ఎన్నో ఉన్నాయని వాటన్నింటికీ సొంతభవనాలు నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు
ఎలక్షన్ సమయంలో చెప్పినట్లుగానే తాను నిజాయితీగా నికార్సైన నాయకుడిగా పని చేస్తానని తప్పు చేస్తే చూపించాలని తలవంచుకొని పనిచేస్తారని ఆయన అన్నారు. గత ప్రభుత్వ పాలనలో క్యాంపు కార్యాలయంలోకి ఎవరిని కూడా అనుమతించేవారు కాదని నేడు క్యాంపు కార్యాలయంలో పండగ వాతావరణం నెలకొనడం సంతోషకరంగా ఉందని ఆయన అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచే అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని, ఇతర వారికి అవకాశం ఇస్తే అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని దీనిని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మన అభ్యర్థులను గెలిపించేందుకే కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన వనపర్తి పట్టణం మరియు మండలాల వారీగా లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసి మహిళలతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో వనపర్తి పట్టణ, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. (Story : పెద్ద జీతగాడిలా పని చేస్తా మెఘా మార్క్ చూపిస్తా)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1