Homeవార్తలుతెలంగాణరైతు భరోసా ఇవ్వాలని మహిళా కూలీల నిరసన

రైతు భరోసా ఇవ్వాలని మహిళా కూలీల నిరసన

రైతు భరోసా ఇవ్వాలని మహిళా కూలీల నిరసన

న్యూస్‌తెలుగు/వనపర్తి : ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా ఎకరానికి 15000 చెల్లించాలి అని బి.ఆర్.ఎస్ డిమాండ్ చేసింది మండలములోని పెద్దగూడెం గ్రామములో నాట్లు వేస్తున్న మహిళా కూలీలు రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మోసపోయామని మహిళకు 2500ఇస్తామంటే గంప గుట్టగా ఓట్లు వేసామాని కె.సి.ఆర్ హయాములో వచ్చే రైతు భరోసా బొందపెట్టి మానోట్లో మట్టి కొట్టారని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పెద్దగుడెం చౌరస్తాలో బి.ఆర్.ఎస్ నాయకులతో కలసి రైతులు వరంగల్ డిక్లరేషన్ సాక్షిగా ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ ఆ హామీల పత్రాలను భోగిమంటల్లో వేసి కాల్చి తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం నాయకులు గట్టు యాదవ్,వాకిటి.శ్రీధర్,పి.రమేష్ గౌడ్ మాట్లాడుతూ అధికారం కోసం ఆరు గ్యారంటీలు,420హామీలు ఇచ్చి నేటి ప్రభుత్వం ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుంది. ముఖ్యంగా రైతులకు సమగ్ర రుణ మాఫీ చేస్తామని చెప్పి రుణ మాఫీకి 40వేలకోట్లు అవసరమని ప్రకటించి క్యాబినెట్ నందు 27వేల కోట్లకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం కేవలం 17వేల కోట్లు ఇచ్చి అరకొర రుణ మాఫీ చేసి చేతులు దులుపుకున్నారు. అంతే కాకుండా అధికారం వచ్చిన 100రోజులలో రైతు భరోసా ప్రతి ఏకారానీకి 15000ఇస్తామని ఇప్పుడు నాన కొర్రీలు,ఆంక్షలు పెట్టీ ఎకరానికి 12000వేలు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని బి.ఆర్.ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. గతములో కె.సి.ఆర్ గారు గతప్రభుత్వములో కేటాయించిన 7600 కోట్లు మాత్రమే ఇచ్చిన ఈ ప్రభుత్వం ఒక్క పైసా కూడా రైతు భరోసా ఇవ్వకుండా వానాకాలం రైతు భరోసా ఎగ్గొట్టింది.
ఇప్పుడేమో వ్యవసాయ యోగ్యమైన భూములకు 12000వేలు ఇస్తామని అధికుడా జనవరి 26తర్వాత ఇస్తామని చెబుతూ స్పష్టత లేకుండా ప్రకటనలు చేయడం వల్ల రైతులు ఆందోళనకు గురవుతున్నారు.అదేవిధంగా కౌలు,రైతు కూలీలకు ఇస్తామన్న 12000వేల గురించి ఊసే లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం గతంలో ఎగ్గొట్టిన 7500 మరియు పెంచిన 2500తో కలిపి ఎకరానికి 17500రూపాయలు చెల్లించాలని బి.ఆర్.ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రైతులకు ఈ ప్రభుత్వం బకాయిపడ్డ 26వేల కోట్ల రైతు భరోసా, కౌలు రైతులకు,రైతు కూలీలకు 12000వేలు చెల్లించేవరకు రైతులతో కలసి పోరాడుతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో పి.కురుమూర్తి యాదవ్,మార్కు ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్, నందీమల్ల.అశోక్,గంధం.పరంజ్యోతి,రఘువర్ధాన్ రెడ్డి,మహేశ్వర్ రెడ్డి,మాధవ్ రెడ్డి, డెవర్ల.నరసింహ,సుదర్శన్ రెడ్డి, నరేష్,చిట్యాల.రాము,బండారు కృష్ణ, నాగన్న యాదవ్ ఉంగ్లమ్. తిరుమల్,స్టార్.రహీమ్,ప్రేమ్ నాథ్ రెడ్డి,బొబ్బిలి.ప్రేమ్ కుమార్, జోహేబ్ హుస్సేన్, ఆరీప్,శ్రీను, ఇమ్రాన్,ధర్మా నాయక్,బాలకృష్ణ,నారాయణ నాయక్, టీక్యా నాయక్,మాజీ సర్పంచ్. కొండన్న,అశోక్ కుమార్,తెలుగు.వెంకటయ్య,చోటు, సుధాకర్ చారి,బాబు నాయక్, నందిమల్ల.సుబ్బు,రామస్వామి,శివ లక్ష్మణ్ గౌడ్,ముని,అఖిలందర్,తదితరులు పాల్గొన్నారు. (Story : రైతు భరోసా ఇవ్వాలని మహిళా కూలీల నిరసన)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!