ఏఐసిటియు నూతన రాష్ట్ర కమిటీ 21 మందితో ఎన్నిక
న్యూస్‌తెలుగు/వనపర్తి :అఖిల భారత కార్మిక సంఘాల కేంద్రం (AICTU) రాష్ట్ర నిర్మాణ జనరల్ బాడీ సమావేశం మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో జరిగింది. ఈ నిర్మాణ జనరల్ బాడీ సమావేశం నూతన రాష్ట్ర కమిటీ ని 21 మందితో ఎన్నిక జరిగింది. రాష్ట్ర గౌరవాధ్యక్షులు గా నర్ర ప్రతాప్, రాష్ట్ర అధ్యక్షులుగా తుడుం అనిల్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా రాయబండి పాండురంగాచారి, ఉపాధ్యక్షులుగా సుంచు జగదీశ్వర్, మాలోతు జబ్బార్ నాయక్, సహయ కార్యదర్శులు గా కంచ వెంకన్న యం యస్ రావు కోశాధికారి గా కర్ర దానయ్య గార్లతోపాటు వివిధ జిల్లాల నుండి రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్నికైనారు. కార్మికుల హక్కుల కోసం సంఘటితంగా ఉద్యమిస్తాం హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని ఓంకార్ భవన్ లోఎఐసిటియు నూతన రాష్ట్ర అధ్యక్షులు తుడుం అనిల్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ రాయబండి పాండురంగా చారి గార్లు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కార్మికుల హక్కుల కోసం కార్మిక వర్గాన్ని సంఘటిత పరచి ఉద్యమించనున్నామని తెలియజేశారు.అసంఘటిత రంగాలలోని కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధిని మరిచాయని ఆరోపించారు.రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలు స్థాపించాలని,నిరుద్యోగులకు ఉద్యోగం ఉపాధి కలిపించాలని డిమాండ్ చేశారు. కార్మికల సంక్షేమం కోసం తక్షణం కార్మిక సంక్షేమ బోర్డు ను ఏర్పాటు చేయాలని లేనియెడల కార్మిక వర్గాన్ని సంఘటిత పరిచి ఆందోళనకు పూనుకుంటామని వారు హెచ్చరించారు. మహబూబాద్ జిల్లా కేసముద్రంలో నిన్న జనవరి 5న జరిగిన ఏఐసిటియు రాష్ట్ర నిర్మాణ జనరల్ బాడీ సమావేశం లో కార్మిక వర్గం అనేక పోరాట ద్వారా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను పునరుద్ధరణ చేయాలని,కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలన లో తెస్తున్న 4 లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని, అలాగే తదితర కార్మికుల పలు డిమాండ్లతో కూడిన భవిష్యత్తు ఆందోళనకు ఏకగ్రీవంగా సమావేశం తీర్మానించినట్లు తెలియజేశారు. (Story : ఏఐసిటియు నూతన రాష్ట్ర కమిటీ 21 మందితో ఎన్నిక)