సిఆర్పిఎఫ్151 బెటాలియన్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్
న్యూస్ తెలుగు/చింతూరు : చత్తీస్గడ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా కోరగుట్ట ఇటీవల సిఆర్పిఎఫ్ 151 క్యాంపును ప్రారంభించారు. మావోయిస్టు ప్రభావితప్రాంతం అయిన కొరగుట్ట లో సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శిబిరాన్ని సీనియర్ అధికారులు కుంట డి ఐ జి సూరజ్ పాల్ వర్మ,151 కమాండెంట్ రాజీవ్ కుమార్,204 కొబ్రా బెటాలియన్ కమాండెంట్ సంతోష్ కుమార్, ఆదేశాల మేరకు బుధ, గురు, శుక్రవారం మూడు రోజులు సివిక్ యాక్షన్ ప్రోగ్రాం నిర్వహణలో భాగం గా వైద్య ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ (యఫ్. ఓ. బి )ద్వారా, సి ఆర్ పి యఫ్ సంయుక్తంగా ఒక స్ప్రింగ్ బోర్డ్ గా పనిచేసి ప్రజలకు సేవలందించే కార్యక్రమంలో ఈ వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో వివిధ కొరగుట్ట లోని గిరిజనులకు వచ్చే స్వల్ప కాలిక వచ్చే వ్యాధులు, దగ్గు, మలేరియా, కీళ్ల నొప్పులు, గాయాలు,జలుబు, జ్వరం, మలేరియా, టైఫాయిడ్, రక్తపోటు తదితర చికిత్సలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొరగుట్ట సమీపంలోని ప్రజలు పురుషులు, మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ క్యాంపు లోనే ఆధార్ కార్డు లేని వారికి వెంటనే ఆధార్ కార్డులు జారీ చేసే ప్రక్రియ ప్రారంభించారు. భవిష్యత్తులో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ఆమె ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ అధికారులు సిబ్బంది, సమీప గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.(Story : సిఆర్పిఎఫ్151 బెటాలియన్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ )

