“నాయకత్వం ప్రేరణగా, పార్టీ సిద్ధాంతాలకు మద్దతుగా శాశ్వత సభ్యత్వాలు!”
న్యూస్ తెలుగు / వినుకొండ : శాశ్వత సభ్యత్వాలతో తెలుగుదేశం పార్టీకి మరింత బలం. ప్రజల విశ్వాసానికి నిదర్శనం – లక్ష రూపాయలతో శాశ్వత సభ్యత్వం అని జీవి ఆంజనేయులు తెలిపారు. తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వం తీసుకుని లక్ష రూపాయలు చెల్లించిన నాయకులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీ నిబద్ధత, నాయకత్వం పార్టీకి శక్తి మరియు ప్రేరణగా నిలుస్తోంది. పార్టీ సిద్ధాంతాలు మరియు ప్రజా సంక్షేమం కోసం మీరు చూపిస్తున్న మద్దతు అనునిత్యం ఆదర్శప్రాయంగా ఉంటుంది. మీ భాగస్వామ్యంతో తెలుగుదేశం పార్టీ మరింత బలంగా ఎదుగుతుందని విశ్వసిస్తున్నాను అని జీవి అన్నారు. ఈ సందర్భంగా ప్రధాన నాయకులుగా జడ్పిటిసి జడ్డా సుబ్బరామయ్య, కట్టమూరి శ్రీనివాసరావు, కాసరగడ్డ గోవిందరాజులు, జాగర్లమూడి శ్రీనివాసరావు, కొండపల్లి బ్రహ్మయ్య, యాగంటి వెంకట్రావు ను ప్రత్యేకంగా ప్రశంసించారు.. వీరు రూ. లక్ష చొప్పున చెల్లించి తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వం పొందినందుకు గర్వపడుతున్నాను అని చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , యువనేత మంత్రి నారా లోకేష్ ఇచ్చిన పిలుపుకు స్పందించి, వినుకొండ నియోజకవర్గంలో గురువారానికి 34 శాశ్వత సభ్యత్వాలు నమోదు కావడం అత్యంత సంతోషకరమన్నారు. ఇంత భారీ సంఖ్యలో సభ్యత్వాల నమోదు తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసానికి నిదర్శనమని తెలిపారు. ఇది సాధ్యమవడంలో అధిష్టానం అండతో పాటు, స్థానికంగా నాయకులు, కార్యకర్తల కృషి, పార్టీ పట్ల వారి అంకితభావం కీలక పాత్ర పోషించిందని జీవి ఆంజనేయులు పేర్కొన్నారు. కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావించే పార్టీ తెలుగుదేశం మాత్రమేనని, దేశంలో కార్యకర్తలకు బీమా అందిస్తున్న పార్టీ కూడా తెలుగుదేశం అని గర్వంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ముందుకు సాగడంలో ఈ శాశ్వత సభ్యత్వాలు కీలక మైలురాయి కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. (Story : “నాయకత్వం ప్రేరణగా, పార్టీ సిద్ధాంతాలకు మద్దతుగా శాశ్వత సభ్యత్వాలు!” )