చెరువుల బలోపేతానికి నిధుల మంజూరు
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి నియోజకవర్గం పెద్దమందడి మండలంలోని పలు చెరువుల పటిష్టత కోసం రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్ల 43 లక్షల నిధులు మంజూరు చేసింది పెద్దమందడి మండల కేంద్రంలోని పెద్ద చెరువు బలోపేతం కోసం ఒక కోటి 12 లక్షలను, ) దొడగుంటపల్లి గ్రామ ఊర చెరువు పటిష్టత కోసం 76 లక్షలు వెల్టూర్ చెరువు పటిష్టత కోసం 66 లక్షల50వేల రూపాయలను మంజూరు చేసినట్లు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు . ఈ చెరువులను పటిష్ట పరచడంతో ఆయా గ్రామాలకు సంబంధించిన దాదాపు 1500 నుంచి 2000 ఎకరాలకు నిరాటంకంగా సాగునీరు అందించవచ్చునని ఆయన తెలిపారు. అన్నదాతల శ్రేయస్సు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రజల శ్రేయస్సు కోసమే ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. (Story :చెరువుల బలోపేతానికి నిధుల మంజూరు)