ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన గుమ్మడి సంధ్యారాణి
న్యూస్ తెలుగు /సాలూరు : ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మిడి సంధ్యారాణి గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను కలిసి ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తీసుకున్న చర్యలు ఎంతో ప్రసంశనీయమని అన్నారు. గత సంవత్సరం రాష్ట్రానికి వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని స్మరించుకుంటూ, ఈ కొత్త సంవత్సరంలో మరింత అభివృద్ధి సాధించేందుకు ఆయనకు శక్తి, ఆరోగ్యం, ఆయుష్షు ప్రసాదించమని దేవుని కోరుకుంటున్నానని ఆమె తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. (Story : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన గుమ్మడి సంధ్యారాణి)