Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం

పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం

పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం

మున్సిపల్ కమిషనర్ చంద్రబోస్

న్యూస్ తెలుగు /వినుకొండ  : పారిశుధ్య కార్మికులతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న వినుకొండ మునిసిపల్ కమీషనర్ సుభాష్ చంద్రబోస్ పట్టణ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ. ప్రజలందరి సహాకారాలతో పురపాలక శాఖ సిబ్బంది సహకారంతో పట్టణములో శానిటేషన్ కార్యక్రమాన్ని చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగిందని, డివైడర్స్, రోడ్ మార్జిన్స్ పబ్లిక్ గ్రీనరీ, గానీ వాటినన్నింటినీ అందంగా సుందరీకరణముగా చేయడం జరిగిందని, స్ట్రీట్ లైటింగ్ వచ్చేసరికి విపరీతమైన కంప్లైంట్స్ ఉన్నాయని వాటన్నింటినీ 24 గంటల్లో 12 గంటల్లో 6 గంటల్లో లోపులే పాడయిపోయిన లైట్స్ ని ఇమ్మీడియేట్గా రిపేర్ చేసి ఎక్కడికక్కడ చీకటిలేని వినుకొండని తీర్చిదిద్దే కార్యక్రమంలో చాలా ముందున్నామని అన్నారు. అలాగే రక్షిత మంచినీటిని ఇచ్చే కార్యక్రమంలో మనం పరిశుభ్రమైన నీటిని అందిస్తున్నామని, ప్రతినిత్యం అమృత్ స్కీం కింద రక్షిత మంచినీరు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. దాంట్లో భాగంగా ఎస్ టి పి ఏదైతే ఉందో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ రెండు శాంక్షన్ అవ్వడం జరిగిందని వాటిని అమృత్ స్కీం క్రింద ముట్లకుంట కాలనీలో చక్కవాగులో ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు .ఎక్కడైతే మనకు రోడ్లు డ్రైన్స్ లేకుండా ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చీఫ్ విప్ జి వి ఆంజనేయులు సహకారాలతో వారి తోడ్పాటుతో పట్టణములో మరింత అందంగా మరింత శుభ్రంగా మరింత సంక్షేమ పథకాలు అందరికీ వెళ్లే విధంగా ప్రతినిత్యం నీరు అందేవిధంగా అలాగే నాలుగు కొత్త బస్ స్టాప్స్ ఏర్పాటు శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసే విధంగా అలాగే పబ్లిక్ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కొత్తగా నిర్మాణం చేసేటట్టుగా పబ్లిక్ యూరినల్స్ రెండు ప్రదేశాలలో ఏర్పాటు చేసేవిధంగా సన్నాహాలు చేస్తున్నామని ఏనుపాలెం సెంటర్ శివయ్య స్తూపం వద్ద వీటి అవసరం చాలా ఉందని తెలిపారు. అట్లాగే గ్రీనరీ కోసం మంచి మొక్కలు తెప్పించి పూర్తిస్థాయిలో కారంపూడి రోడ్ మార్కాపురం రోడ్ నరసరావుపేట రోడ్ లో కూడా గ్రీనరీని ఏర్పాటు చేయుటకు పూనుకున్నామని తెలిపారు .టాక్స్ పే చేయడంలో వినుకొండ పురప్రజలు వ్యాపారస్తులు రాష్ట్రంలోనే అగ్ర స్థాయిలో ఉన్నారు. ఈ సందర్భంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు. .ప్రజల తోడ్పాటుతో ప్రజల భాగస్వామ్యంతో వ్యాపార సంస్థల భాగస్వామ్యంతో వినుకొండ పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. అలాగే ఆగిపోయిన టిడ్కో ఇళ్ల నిర్మాణం మళ్లీ చేపడుతున్నట్టు తెలిపారు.వీటిని కొత్త సంవత్సరము 300 స్క్వేర్ ఫీట్ ఇళ్లను 90 శాతమునకు పైగా పూర్తి అయ్యాయని వాటిని మరింత తొందరగా చీఫ్ విప్ గారి తోడ్పాటుతో తొందర్లోనే వాటిని లబ్ధిదారులకు ఇచ్చే కార్యక్రమం చేపడతామని తెలిపారు.అలాగే ఎన్టీఆర్ కాలనీలో కూడా ఆగిపోయిన మౌలిక వసతులు తొందరగా ఏర్పాటు చేసి వాటిని కొత్త ప్రభుత్వం ఇంకా రెండు సెంట్స్ ఇచ్చే కార్యక్రమమును కూడా చేపట్టడం జరుగుతుందని తెలిపారు.అలాగే పెన్షన్స్ బట్వాడాలో వినూత్నంగా ఒక రోజు ముందుగానే పర్వదినాలలో లేదా ఒకటవ తేదీ ఆదివారం పడినప్పుడు ఒక రోజు ముందుగానే పెన్షన్ కార్యక్రమం చేపడుతున్నట్టు చెప్పారు. అలాగే భార్య భర్తలిద్దరిలో పెన్షన్ దారులు చనిపోతే 15 రోజుల లోపలే కొత్త పింఛను పునరుద్ధరించే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేపట్టడం సంతోషదాయకమని అన్నారు. అలాగే మూడు సిలిండర్లు పంపిణీ కార్యక్రమం దిగ్విజయంగా చేపట్టడం జరిగిందని అన్నారు. అలాగే ఏనెస్పీ కాలువ ఐ లవ్ వినుకొండ ప్రాంతంనందు భవిష్యత్తులో ఫౌంటైన్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.వినుకొండ మున్సిపాలిటీ నందు గల అతిపెద్ద ల్యాండ్ బ్యాంకు అయినటువంటి 22 ఎకరాలలో ప్రభుత్వ చీఫ్ విప్ కోరిక మేరకు ప్రజలకు వినూత్నమైన ఆహ్లాదకరమైన సేవలు అందించే కార్యక్రమంలో భాగంగా అనేక కార్యక్రమాలు షాదీ ఖానా నిర్మాణం టీటీడీ కళ్యాణ మండపం ఓపెన్ జిమ్ స్టేడియం మల్టీలెవెల్ కాంప్లెక్స్ వంటి సరికొత్త అభివృద్ధి పనులు త్వరలోనే రూపు దిద్దుకుంటాయని పట్టణమునకు రావాల్సిన అనేక మౌలిక సదుపాయాలు ఇంకా నిర్మాణాలు చేపట్టవలసిన డ్రైనేజీలు రోడ్లు మొదలగునవి కొత్త సంవత్సరంలో పూర్తి చేస్తామని పట్టణ ప్రజలు ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జి వి ఆంజనేయులు తోడ్పాటుతో వినుకొండ పట్టణాన్ని మరింత సుందరంగా మరింత ఆహ్లాదంగా అన్ని రకాల మౌలిక సదుపాయాలతో ముందుకు తీసుకువెళతామని అన్నారు.(Story : పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం )

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!