గంగినేని రాఘవకు సన్మానం
2025 విశాలాంధ్ర క్యాలెండర్ ఆవిష్కరణ
న్యూస్ తెలుగు /వినుకొండ : త్రిపురాపురం డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగాఎన్నికైన గంగినేని ఫౌండేషన్ అధ్యక్షులు గంగినేని రాఘవ ని సోమవారం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాఘవరావు చేతుల మీదుగా యూనియన్ డైరీ ని మరియు విశాలాంధ్ర టౌన్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ. రాఘవరావు పేద విద్యార్థులకు అందిస్తున్న సహాయ సహకారాలు, సమైక్యాంధ్ర ఉద్యమం లో ఆర్టీసీ ఉద్యోగులకు అందించిన చేయూతలను ,కరోనా లాంటి విపత్కర సమయంలో ప్రైవేట్ స్కూల్ అధ్యాపకులు మరియు ఆర్టీసీ ఉద్యోగులకు అందించిన సహాయం ను మరువలేమని తెలిపారు. ఈ సందర్భంగా రాఘవరావు రైతు లకు మెరుగయిన సేవలు అందించాలని, ఒక సామాజిక కార్యకర్త గా సమాజానికి ఇంకా ఎన్నో సేవలు అందించాలని, భవిష్యత్తు లో ఇంకా ఉన్నత మైన పదవులను అలంకరించాలని అన్నారు. (Story : గంగినేని రాఘవకు సన్మానం)