యుటిఎఫ్ స్వర్ణోత్సవ ప్రచార జాత
న్యూస్ తెలుగు / వినుకొండ :యుటిఎఫ్ ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకుంటూ, జనవరి 5,6,7,8 తారీఖులలో కాకినాడలో అటహాసంగా జరగబోతున్న యుటిఎఫ్ రాష్ట్ర మహాసభల ప్రచార జాత పల్నాడు జిల్లాలోని వినుకొండకు ఉదయం 9 గంటలకు చేరుకుంది. వినుకొండ ప్రాంతంలోని యుటిఎఫ్ నాయకత్వ విఠంరాజుపల్లి వద్ద జాతను ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంను కృష్ణ, గుంటూరు గ్రాడ్యుయేట్ శాసనమండలి సభ్యులు కె.ఎస్. లక్ష్మణరావు జండా ఊపి ప్రారంభించారు. వినుకొండ పురవీధులలో జాత నిర్వహించడం జరిగింది. లక్ష్మణ్ రావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించటంలో యుటిఎఫ్ చేస్తున్న కృషిని అభినందించారు. యుటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయం నందు సీనియర్ నాయకులు విశ్రాంత ఉపాధ్యాయులు అప్పరాజు నాగేశ్వరావు పతాకావిష్కరణ చేయగా, జిల్లా అధ్యక్షులు కె. శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.మోహన్ రావు, జిల్లా సహాధ్యక్షులు జేవిడి నాయక్, జిల్లా కోశాధికారి ఎం.రవిబాబు, ఆడిట్ కమిటీ కన్వీనర్ ఆర్.అజయ్ కుమార్, మెంబర్ జిలాని, రాష్ట్ర కౌన్సిలర్లు పి.ప్రేమ కుమార్, డి.వి.లింగయ్య లతోపాటు నియోజకవర్గం లోని ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. (Story : యుటిఎఫ్ స్వర్ణోత్సవ ప్రచార జాత)