సోమవారం సాలూరులో గ్రీవెన్స్
న్యూస్ తెలుగు/సాలూరు : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( గ్రీవెన్స్) ను సోమవారం సాలూరులో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన జారీ చేశారు. సోమవారం ఉదయం 10 గంటల నుండి సాలూరు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రజలు తమ సమస్యలను సాలూరులో సమర్పించవచ్చని ఆయన పేర్కొన్నారు. జిల్లా అధికారులందరూ సాలూరులో జరిగే పిజిఆర్ఎస్ కు హాజరుకావాలని ఆయన తెలిపారు. పీజిఆర్ఎస్ అనంతరం శంబర జాతరపై సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఆయన చెప్పారు.(Story : సోమవారం సాలూరులో గ్రీవెన్స్)