ఆంధ్రుల ఆరాధ్య నటుడు అక్కినేని
శత వసంతాల స్వరాంజలి సభలో ఆయుర్వేద వైద్యుడు జమాల్ ఖాన్
చింతూరు (న్యూస్ తెలుగు ) : ఆంధ్రుల ఆరాధ్య అభిమాన నటుడు అక్కినేని నాగేశ్వరరావు శత వసంతాల స్వరాంజలి ఏలూరు లోని సర్ సి ఆర్ ఆర్ కళాశాల ఆడిటోరియంలో కనుల విందుగా జరిగింది. ఘంటసాల స్వర పీఠం ఎస్ ఎం సుభాని వ్యవస్థాపక కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జెకె సిటీ ట్రస్ట్ చైర్మన్ మొహమ్మద్ జమాల్ ఖాన్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడినారు. తొలుత అక్కినేని నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. జమాల్ ఖాన్ మాట్లాడుతూతెలుగు చలనచిత్ర రంగంలో నవల నాయకుడిగా ప్రేమ విషాద కథ చిత్రాలకు అభినయ రారాజుగా వెలుగొందిన పద్మ విభూషణ్ నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన చిత్రాలు ఆంధ్రుల హృదయాల్లో నిలిచిపోయాయని అన్నారు. రంగస్థలం నటన నుండి ప్రారంభమైన ఆయన ప్రస్థానం వెండితెరపై ఒక వెలుగు వెలిగిందన్నారు . క్రమశిక్షణకు మారుపేరుగా నిబద్ధత నిజాయితీ కి నిలువుటద్దముల నిలిచిన ఒక నటన కౌశల్యుడని అభినందించారు. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అశేష ఆంధ్ర ప్రజానీకానికి అభిమానిగా చలనచిత్ర రంగంలో చరితాత్ములు అయినారని అన్నారు. పట్టుదల కార్యదీక్షతో ఆయన నటన రంగంలో ఎంతో ఎత్తుకు ఎదిగి లక్షలాది అభిమానుల కు చేరువ అయ్యారన్నారు. అనంతరం విశిష్ట అతిథిగా విచ్చేసిన మాజీ శాసన మండలి చైర్మన్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షరీఫ్ మాట్లాడుతూ ఏఎన్ఆర్ అంటే ఎదురులేని నటన అని రంగస్థలం నుండి చిన్నచిన్న వినోద కార్యక్రమాలు ప్రారంభించి అనతి కాలంలోనే ఆంధ్రుల అభిమానాన్ని చూరగొన్న గొప్ప నటుడు అని అన్నారు. ఎటువంటి రాజకీయాలకు తావు లేకుండా తన కుటుంబాన్ని ఒక క్రమ పద్ధతిలో ఉంచి తాను మితవాదిగా ఉండేవారని ఈ సందర్భంగా అన్నారు. అనంతరం జమాల్ ఖాన్ను , షరీఫ్, మరియు ఇతర అతిరథ మహారధులను ఘంటసాల స్వరపీఠం వ్యవస్థాపక కార్యదర్శి సుభహాని , మైనారిటీ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి షేక్ మాబు సుభాని, దేవరకొండ కోటేశ్వరరావు ,ఆలపాటి నాగేశ్వరరావు, రెడ్డి అప్పలనాయుడు, ఎండి మస్తానమ్మ, గారపాటి సీతారామాంజనేయ చౌదరి లను షాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా శ్రీమతి జి నీలిమ, కార్యక్రమంలో ఆ పాత మధుర గాన రంజని కార్యక్రమంలో పలు గేయాలను వీటి అర్జున్ రావు, శ్రీమతి ఆశ ఆలపించారు. ఈ కార్యక్రమంలో నూర్ భాషా మైనారిటీ సాధికార కమిటీ కన్వీనర్ షేక్ సుభాన్. షేక్ ఇబ్రహీం, నూర్ భాషా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మస్తానమ్మ, కార్యక్రమ నిర్వహణ కమిటీ తదితరులు పాల్గొన్నారు.(Story : ఆంధ్రుల ఆరాధ్య నటుడు అక్కినేని )