చింతూరు లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులు
న్యూస్‌తెలుగు/ చింతూరు : మాజీ ప్రధాని పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత ఆర్థిక దిగ్గజం మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా శుక్రవారం జెకె సిటీ ట్రస్ట్ చైర్మన్ మొహమ్మద్ జమాల్ ఖాన్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూ లమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఆపై దేశ ప్రధానిగా విధులు నిర్వహించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సేవలు భారతదేశానికి ఎనలేని సేవలు అందించారని దేశ ప్రగతికి ప్రణాళిక బద్ధంగా వ్యవహరించిన గొప్ప ఆర్థిక వేత్త అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జెకె సి టి ట్రస్ట్ సభ్యులు ఎస్ కే రియాజ్, నాజర్ ఖాన్, నటరాజ్, విక్కీ, రమణ, అజీజ్ మరియు నాయకులు ముత్యాల శ్రీరామ్, మడివి రాజు తదితరులు పాల్గొన్నారు. (Story : చింతూరు లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులు)