మహా మండల పూజలో పాల్గొన్న మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : అయ్యప్పస్వామి మహా మండల పూజ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ వారు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. అనంతరము స్వామి వారి అష్టాభీషేకాలలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రమేష్ శర్మ గారు తీర్థప్రసాదాలు అందజేశారు. నిరంజన్ రెడ్డి వెంట గురుస్వామి,నందిమల్ల.అశోక్,ఆలయ అధ్యక్షులు నగేష్,గట్టు వెంకన్న,చిట్యాల.రాము,అఖిలెందర్ తదితరులు పాల్గొన్నారు. (Story : మహా మండల పూజలో పాల్గొన్న మాజీ మంత్రి)