జనులందరిని కరుణ,ప్రేమ,ఆప్యాయతతో చూడడం యేసు క్రీస్తుకు ప్రీతిపాత్రము
న్యూస్‌తెలుగు/వనపర్తి : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి క్రిస్మస్ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో పాస్టర్ల ప్రార్థనల నడుమ క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా వేడుకలు ప్రారంభించారు. గంధం.పరంజ్యోతి, పాస్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యములో పలువురు పాస్టర్లు నిరంజన్ రెడ్డి కి ఆశీర్వాదాలు అందజేస్తూ రాబోవుకాలములో ఉన్నతమైన పదవులు అధికారం పొంది అభివృద్ధి కొనసాగించాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.యేసు ప్రభువు ప్రజల సుఖసంతోషాలతో ఉండాలని త్యాగాలు చేశారని అన్నారు.
మానవులందరికి కరుణ ప్రేమ ఆప్యాయత అనురాగం పంచాలని,ద్వేషం,అసూయ పెంచుకోకుండా మానవులందరిని సమానంగా చూడాలని ఉద్బోధించారని వారి అడుగుజాడలలో నడుస్తూ మనలో ఉన్న రుగ్మతలను వదిలిపెట్టి ప్రతి క్రిస్మస్ పండుగకు ఒక కొత్త మంచి అలవాటును నేర్చుకోవాలని హితవు పలికారు.
దేవుని ఎరూపములో కొలిచిన మనలోని చెడును విసర్జించి మంచిని అస్వాదించినపుడే భగవంతుడు అశీర్వాదిస్తాడని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాస్టర్లు జనార్ధన్,కృపాకర్,యేసన్న,నిర్మల లవింగ్ స్టన్,డాక్టర్.రాఘవులు,జోషప్,యాకూబ్,గంధం.విజయ్ కుమార్,కేశవ్,జాన్ మార్కు,స్వామి దాస్,సిటిజన్ సి.ఈ.ఓ రవికుమార్
నాయకులు వాకిటి.శ్రీధర్,పి.రమేష్ గౌడ్, నందిమల్ల.అశోక్,బండారు.కృష్ణ, నాగన్న యాదవ్, ఉంగ్లమ్మ్.తిరుమల్,ప్రేమ్ నాథ్ రెడ్డి,ఇమ్రాన్,గులాం ఖాదర్ ఖాన్,రమేష్ నాయక్,స్టార్.రహీమ్,మురళీ సాగర్,సునీల్ వాల్మీకి,A.K.పాషా,జాణంపేట.శ్రీనివాసులు,డాక్టర్. ద్యానియల్ఆరీఫ్,చిట్యాల.రాము, నందిమల్లా రవి,ఎం.బాలరాజు,డి.మన్యం,అఖిలేందర్ వజ్రాల.సాయిబాబా, శిరి వాటి. శంకర్, గొర్ల.రాంచందర్,చిలుక.సత్యం,నయ్యూమ్,హఫీజ్,సి.వినోద్,ప్రశాంత్ వజ్రాల.రమేష్,కుమ్మరి.రామస్వామి, మునేశ్వర్,ఖాధర్శా,తోట.శ్రీను,రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. (Story : జనులందరిని కరుణ,ప్రేమ,ఆప్యాయతతో చూడడం యేసు క్రీస్తుకు ప్రీతిపాత్రము)