“బ్రాహ్మణ సేవా సంఘo” ఆధ్వర్యంలో పి.వి నరసింహారావు వర్ధంతి
న్యూస్ తెలుగు / వినుకొండ : ‘బ్రాహ్మణ భవన్’ లో వినుకొండ నియోజకవర్గ “బ్రాహ్మణ సేవా సంఘo” ఆధ్వర్యంలో సోమవారం మాజీ ప్రధాని, భారతరత్న, “పి.వి నరసింహారావు” వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అందించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ పెద్దలు పి.వి. సురేష్ బాబు, గాలి శ్రీనివాసరావు, మంత్రిరాజు సత్యనారాయణ, పట్టణ పురోహితులు యడవల్లి శ్రీనివాస శర్మ, అన్నాప్రగడ వెంకటేశ్వరరావు, భాగవతుల రవికుమార్,శర్మ మాస్టర్ (గాయత్రీ స్కూల్) గుంటి ఆంజనేయ దేవస్థానం అర్చకులు నారాయణం ఆనందా చార్యులు తో పాటు వినుకొండ బ్రాహ్మణ సేవా సంఘ అధ్యక్షులు ఎం. శివకుమార్, ప్రధాన కార్యదర్శి వి. చంద్ర శేఖర శర్మ, కోశాధికారి పి.హనుమంతరావు తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు… ఈ సందర్భంగా పి. వి. సురేష్ బాబు మాట్లాడుతూ. అపర కర్మ సత్రం కి పీవీ నరసింహారావు పేరు పెట్టుకొని పి.వి.బవనం గా సేవలందిస్తూ ఉన్నము శాశ్వత భవనాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జీవీ ఆంజనేయులు సహాయంతో పి.వి.నరసింహారావు జయంతికి ఏర్పాటు చేస్తామని అన్నారు. గాలి శ్రీనివాసరావు మాట్లాడుతూ. ప్రధానమంత్రిగా దేశానికి సేవలందించిన మహనీయుడని మనందరికీ ఆదర్శమని అన్నారు. భాగవతుల రవికుమార్ మాట్లాడుతూ. ఆయన బ్రాహ్మణ కులంలో పుట్టడం మనందరికీ ఎంతో గర్వకారణం అని ఆయన గొప్పతనాన్ని కొనియాడారు. (Story : “బ్రాహ్మణ సేవా సంఘo” ఆధ్వర్యంలో పి.వి నరసింహారావు వర్ధంతి)