తుమ్మల గ్రామంలో రెవిన్యూ సదస్సు
న్యూస్ తెలుగు/చింతూరు,తుమ్మల గ్రామ : పంచాయతీకి చెందిన తుమ్మల, నారాయణపురం గ్రామములలో మరియు గంగన్నమెట్ట గ్రామ పంచాయతీ గంగన్నమెట్ట గ్రామం లో శనివారం రెవెన్యూ సదస్సులు నిర్వహించారు . ఈ గ్రామ సభకు ,తుమ్మల గ్రామ సర్పంచ్, కొవ్వాసి.రామారావు, గంగన్నమెట్ట పంచాయతీ సర్పంచ్ వి. ప్రసాద్, తహసీల్దార్ యస్. చిరంజీవి బాబు, ఆర్. ఐ విగ్నేష్ మండల గ్రామ రెవిన్యూ అధికారులు యమ్. సింగయ్య , సిహెచ్ మోహన్ గ్రామ సర్వేయర్లు టి. జోగయ్య, ఉయిక రవి, ముచ్చిక భద్రయ్య,పారెస్టు డిపార్ట్మెంట్ యఫ్ బి ఓ పి. దుర్గ భవాని మరియు మెడికల్ డిపార్ట్మెంట్ కిషోర్ కుమార్ ఒప్తలమిక్ ఆఫీసర్, మరియు ఎ యన్ యం శిరీష్ దేవి, సిబ్బంది గ్రామ సభలుకు హాజరు అయ్యినారు.ఇందులో భూమి సంబంధిత సమష్యల అనగా, ఆన్లైన్ నమోదు కొరకు, పట్టా మార్పుల కొరకు, అసైన్ మెంట్ పట్టాలు కొరకు, భూమి సర్వే కొరకు, విస్తీర్ణం తప్పులు, కొత్తగా పాస్ పుస్తకం కొరకు ఆర్ ఓ యఫ్ ఆర్ పట్టాలు కొరకు దరఖాస్తులు తీసుకోవటం జరిగినది, రెవిన్యూ దరఖాస్తులు. 31 స్వీకరించారు .
మెడికల్ సంబంధించి 28 మంది చెకప్ చేయించుకున్నారు.(Story : తుమ్మల గ్రామంలో రెవిన్యూ సదస్సు )