అగ్రికల్చర్, ఫార్మసీ చివరి కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..
న్యూస్ తెలుగు/అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వం, ప్రైవేట్ యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కళాశాలల్లో అగ్రిక్చలర్, ఫార్మసీ, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ తదితర కోర్సుల్లో చేరేందుకుగాను చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియకు నోటిపికేషన్ జారీ అయింది. ఏపీ ఈఏపీసెట్`2024(బైపీసీ స్ట్రీమ్)లో భాగంగా వెబ్ ఆధారితంగా ఈ చివరి విడత కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తారు. దీనికి ఈనెల 19 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్లు స్వీకరించారు.
20 నుంచి 22వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు కొనసాగుతాయి. 24వ తేదీన అభ్యర్థుల సీట్లను ఖరారు చేస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆయా ఫార్మసీ, అగ్రికల్చర్ కళాశాలల్లో ఈనెల 24 నుంచి 26వ తేదీ మధ్య సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. అభ్యర్థుల సందేహాల నివృత్తికిగాను జిల్లాల వారీగా ప్రత్యేక హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అభ్యర్థుల ర్యాంకులు, కేటగిరీల వారీగా సీట్లను భర్తీ చేస్తారు. ఈ విద్యా సంవత్సరం ఇప్పటికే ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ముగిసింది. అందులో ప్రవేశాలు పొందిన వారంతా జనవరి నుంచి తొలి విడత సెమిష్టర్ పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ సమయంలో ఏపీ ఈఏపీసెట్(బైపీసీ స్ట్రీమ్) నోటిఫికేషన్‌ను ఆలస్యంగా జారీ జేయడం పట్ల మన రాష్ట్ర విద్యార్థులు హైదరాబాద్, బెంగుళూరు, చెన్నయ్ తదితర ప్రాంతాలకు వెళ్లి ప్రవేశాలు పొందారు. (Story : అగ్రికల్చర్, ఫార్మసీ చివరి కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..)