పెళ్ళైన 20 రోజులకే.. సింగర్ శృతి ఆత్మహత్య
న్యూస్‌తెలుగు/చింతూరు : తెలంగాణ : జానపద పాటలతో ఫేమస్ అయిన సింగర్ శృతి మృతి చెందారు. పెళ్ళైన 20 రోజులకే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇన్ స్టాలో పరిచయమైన సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం పీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ అనే యువకుడితో శృతి ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత భర్త, అత్తమామలు కట్నం కోసం ఆమెను వేధించారు. వేధింపులు తాళలేక శృతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.(Story : పెళ్ళైన 20 రోజులకే.. సింగర్ శృతి ఆత్మహత్య)