సీతం కళాశాల చైర్మన్ బొత్స సత్యనారాయణ తనయుడు సందీప్ బాబు జన్మదిన వేడుకలు
న్యూస్‌తెలుగు/విజయనగరం : సీతం కళాశాల చైర్మన్, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ& బొత్స ఝాన్సీ లక్ష్మీ తనయుడు బొత్స సందీప్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా ధీర ఫౌండేషన్ సౌజన్యంతో సత్యా డిగ్రీ &పీజీ కాలేజ్ ఆధ్వర్యంలో పట్టణంలో గల ప్రేమ సమాజంలో ఉన్న వృద్ధులకు, అభయాంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్న భక్తులకు, పేర్ల వారి వీధిలో గల మూగ ఆందుల పాఠశాల విద్యార్థులకు, పూల్ బాగ్ లో ఉన్న ప్రభుత్వ మూగ చెవిటి పాఠశాలలో గల విద్యార్థులకు సుమారు 500 మందికి దుప్పట్లు, పండ్లు , ఆహార పదార్థాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో సీతం కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ బొత్స ఝాన్సీ లక్ష్మీ పాల్గొని దుప్పట్లు పండ్లు ఆహార పదార్థాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎం.శశిభూషణరావు సత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.వి. సాయి దేవమణి ఎన్ సి సి కెప్టెన్ ఎం.సత్యవేణి, ధీర ఫౌండేషన్ మెంబరు రౌతు చక్రధర్, ఎం ఉదయ్ కిరణ్, ఇతర ఉపాధ్యాయులు , పాల్గొన్నారు. (Story : సీతం కళాశాల చైర్మన్ బొత్స సత్యనారాయణ తనయుడు సందీప్ బాబు జన్మదిన వేడుకలు)