వినుకొండ మున్సిపాలిటీలో ప్రజా దర్బార్
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ మున్సిపాలిటీలో సోమవారం ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆజాద్ నగర్ కాలనీలో మౌలిక వసతుల కోసం సిపిఐ పార్టీ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ లో ప్రభుత్వ చిఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కి, చైర్పర్సన్ దస్తగిరి కి, మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ కి సిపిఐ పార్టీ ఆజాద్ నగర్ కాలనీ సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ పల్నాడు జిల్లా కార్యదర్శి ఏ. మారుతీ వరప్రసాద్ మాట్లాడుతూ. గత 19 సంవత్సరాలుగా ఆజాద్ నగర్ కాలనీకి ప్రభుత్వం నుంచి ఎటువంటి మౌలిక వసతులు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే చైర్పర్సన్ దస్తగిరి , కమిషనర్ సుభాష్ చంద్రబోస్ స్పందించి ఆజాద్ నగర్ కాలనీకి మౌలిక వసతులైన వీధిలైట్లు, రోడ్లు, డ్రైనేజీ ,మంచినీటి కుళాయిలు, కొట్టుడు పంపులు, ఇళ్ళకి కరెంటు మీటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాధికారులని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నియోజకవర్గ సమితి నాయకులు బూదాల శ్రీనివాసరావు, ఉలవలపూడి రాము, పిన్నబోయిన వెంకటేశ్వర్లు, కొప్పరపు మల్లికార్జున, ఎస్. కె మస్తాన్, సుభాని, నాగూర్, మస్తాన్ బి, పద్మ, మంజు, షాహిన్, సురభి, తదితరులు పాల్గొన్నారు. (Story : వినుకొండ మున్సిపాలిటీలో ప్రజా దర్బార్)