Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ‘ఇండియాఫస్ట్ లైఫ్’ నగరంలో విస్తరణ

‘ఇండియాఫస్ట్ లైఫ్’ నగరంలో విస్తరణ

0

‘ఇండియాఫస్ట్ లైఫ్’ నగరంలో విస్తరణ

– వైజాగ్ బ్రాంచ్లో సలహాదారుల నియామకంపై దృష్టి
– దేశవ్యాప్తంగా 18 కొత్త ఏజెన్సీ బ్రాంచ్‌లు ప్రారంభం

న్యూస్‌తెలుగు/ విశాఖపట్నం : ప్రజలకు సమగ్ర జీవిత బీమాతో ఆర్థిక భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా నగరంలో కార్యకలాపాలు విస్తృతం చేయనున్నామని ఇండియాఫస్ట్ లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో రుషబ్ గాంధీ తెలిపారు. అందులో భాగంగా విశాఖపట్నం బ్రాంచ్లో సలహాదారులను నియామించనున్నట్లు తెలిపారు. ‘ఏజెన్సీ నిర్మాణ్’ పేరుతో దేశవ్యాప్తంగా 18 కొత్త బ్రాంచ్‌లను ప్రారంభించామని చెప్పారు. ఈ బ్రాంచ్లు అన్ని మూడు నెలల వ్యవధిలో ఏర్పాటు చేశామన్నారు. మా ఏజెన్సీ ఛానెల్ విస్తరణ దేశవ్యాప్తంగా మా ఉనికిని బలోపేతం చేయడంలో కీలకమైన చర్య అన్నారు. పంపిణీ నెట్వర్క్‌ను విస్తరించడం, వైవిధ్యపరచడం అనే వ్యూహంలో ఇది భాగంగా ఉందన్నారు. రాబోయే రెండేళ్లలో దేశవ్యాప్తంగా సుమారు వంద ఏజెన్సీ బ్రాంచ్‌లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.

ఈ సందర్భంగా ఇండియాఫస్ట్ లైఫ్ ఏజెన్సీ ఛానెల్ ప్రెసిడెంట్ సుమీత్ సాహ్ని మాట్లాడుతూ పాన్ ఇండియా విస్తరణ ద్వారా శక్తివంతమైన ఏజెన్సీ ఛానెల్‌ను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించామన్నారు. ఏజెన్సీ నిర్మాణ్ ద్వారా దేశవ్యాప్తంగా శక్తివంతమైన బ్రాంచ్ నెట్వర్క్‌ను నిర్మించడనున్నామని తెలిపారు. ప్రతి వ్యక్తికి అవసరమైన బీమా పరిష్కారాలు అందించడంలో మా పాంపిణీ నెట్వర్క్ సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటామని చెప్పారు. ఈ బ్రాంచ్‌లు నిరుద్యోగులకు మంచి అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. ఈ చర్య ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. (Story : ‘ఇండియాఫస్ట్ లైఫ్’ నగరంలో విస్తరణ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version