మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలి
ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ
న్యూస్తెలుగు/వనపర్తి : మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కారాలు చేయాలని శుక్రవారం పెబ్బేరు ఎంఈఓ కార్యాలయం ముందు ధర్నా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులు అప్పులు తెచ్చి మరి విద్యార్థుల కడుపులు నింపుతున్నారని. కార్మికుల పెండింగ్ బిల్లులు మాత్రం ఎనిమిది నెలల నుంచి ఇవ్వడం లేదని ఆరోపించారు.. పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని.గుడ్లకు మార్కెట్లో ఏడు రూపాయలు ధర పలుకుతుందని ప్రభుత్వ మాత్రం కార్మికులకు ఐదు రూపాయలు మాత్రమే అందజేస్తుందని తెలియజేశారు. ప్రభుత్వమే గుడ్లను ఉచితంగా సరఫరా చేయాలని. రాజకీయ వేధింపులు. అక్రమ తొలగింపులు అరికట్టాలని. కార్మికులకు కనీస వేతన 26000/- ఇవ్వాలని. పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని. ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని వారికి పని భద్రత కల్పించి పర్మినెంట్ గా వారినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. సంవత్సరానికి నాలుగు జతల కాటన్ చీరలు యూనిఫామ్ లుగా ఇవ్వాలని ప్రమాద బీమా 20 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంఈఓ జయరాములు కు వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు. లక్ష్మి. పద్మ. గోవిందమ్మ శ్రీదేవి సరోజ శేషమ్మ అనురాధ మహేశ్వరి శారద. మన్నెమ్మ.మహిముదా. భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. (Story : మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలి)