డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే
చిన్న రాష్ట్రాలు
బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్
న్యూస్తెలుగు/వనపర్తి : డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా బిఆర్ఎస్ పార్టీ నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా గట్టు యాదవ్, నందిమల్ల అశోక్ మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో చిన్న రాష్ట్రాల వల్ల అభివృద్ధి సాధ్యం అని పేర్కొనడం వల్ల తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ గారి పోరాటం వల్ల సిద్ధించిందని అన్నారు. నేటి పాలకులు బంగారు తెలంగాణను బాధల తెలంగాణ,వలసల తెలంగాణా గా మారుస్తున్నారని వారికి హితబోధ చేయాలని అంబేద్కర్ గారికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో గంధం.పరంజ్యోతి,బండారు.కృష్ణ,నాగన్న యాదవ్,జాత్రా నాయక్,ఇమ్రాన్,సూర్యవంశపు.గిరి,హేమంత్ ముదిరాజ్,సయ్యద్.జమీల్, ద్యానియాల్, మంద.రాము,చిట్యాల.రాము,హారీఫ్,జనంపేట.శ్రీను, అలీము, ఈరపోగు.మన్నెం,సిరివాటి.శంకర్,పి.రాజు,తదితరులు పాల్గొన్నారు. (Story : డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే చిన్న రాష్ట్రాలు)