సిపిఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి
న్యూస్‌తెలుగు/వనపర్తి : సిపిఐ వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణం అంబేద్కర్ చౌక్ లో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతిని నిర్వహించారు. విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పట్టణ కమిటీ కార్యదర్శి జే రమేష్, సిపిఐ జిల్లా నేతలు కళావతమ్మ, గోపాలకృష్ణ, ఎత్తం మహేష్, చందు, పృథ్వినాదం, జయమ్మ, భూమిక మాట్లాడారు. ప్రపంచ మేధావి అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రజలందరి అభివృద్ధికి సమాన అవకాశాలు కల్పించారన్నారు. ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగం రాశారన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు భారత రాజ్యాంగం రక్షణ కల్పిస్తోందన్నారు. మతతత్వ శక్తులు రాజ్యాంగానికి తూట్లు పొడిచే కుట్ర చేస్తున్నాయని తిప్పి కొట్టాలన్నారు. లక్ష్మీనారాయణ, రమణ, శ్రీదేవి, రాముడు తదితరులు పాల్గొన్నారు. (Story : సిపిఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి)