Home వార్తలు ‘కరాటే కిడ్‌: లెజెండ్స్‌’ ట్రైలర్‌ 

‘కరాటే కిడ్‌: లెజెండ్స్‌’ ట్రైలర్‌ 

0

‘కరాటే కిడ్‌: లెజెండ్స్‌’ ట్రైలర్‌ 

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా: భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఫ్రాంచైజీలలో ఒకటైన కరాటే కిడ్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కొత్త భాగం కరాటే కిడ్‌: లెజెండ్స్ కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం 2025 మే 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

కరాటే కిడ్ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు లేని విధంగా, ఈ ఆరవ భాగంలో రెండు ఐకానిక్‌ పాత్రలు — జాకీ చాన్ (Mr. Han) మరియు రాల్ఫ్ మాకియో (Daniel LaRusso) కలిసి తొలిసారి స్క్రీన్‌పై కనిపించనున్నారు. ట్రైలర్‌లో  ఆ పాత్ర కు వారు కష్టపడిన  విధానం, వారి శిక్షణ,  మిస్టర్ మియాగీ లెగసీకి ఘన నివాళిని కూడా అందించడం మీరు ఈ ట్రైలర్‌లో చూశారు.

ఈ కథ లీ ఫాంగ్ (బెన్ వాంగ్) అనే కుంగ్‌ ఫూ ప్రతిభావంతుడిని కేంద్రంగా సాగుతుంది. అతడు తన తల్లితో కలిసి న్యూయార్క్‌ నగరానికి వచ్చి ఓ ప్రసిద్ధ  పాఠశాలలో చేరతాడు. అక్కడ ఒక విద్యార్థిని, ఆమె తండ్రితో స్నేహం ఏర్పడుతుంది. అయితే ఒక లోకల్‌ కరాటే చాంపియన్‌తో గొడవలు మొదలవ్వడం అతని జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఆ తరువాత జరిగిందేమిటి అనేది ఆసక్తికరంగా ఉంటుంది.

తనను తానే రక్షించుకోవాలనే ఉద్దేశంతో, లీ ఫాంగ్‌ కుంగ్‌ ఫూ గురువు మిస్టర్ హాన్ మరియు లెజెండరీ కరాటే కిడ్ డేనియల్ లారూసోల నుంచి శిక్షణ తీసుకుంటాడు. ఇద్దరి శైలి మిళితంతో అతడు ఓ అద్భుతమైన మార్షల్ ఆర్ట్స్‌ పోరుకు సిద్ధమవుతాడు. ఈ ఏపిసోడ్‌ అందర్ని ఎంతో అలరించే విధంగా ఉంటుంది.

జొనథన్ ఎన్‌ట్‌విసిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాకీ చాన్, రాల్ఫ్ మాకియో, బెన్ వాంగ్, జోషువా జాక్సన్, సేడీ స్టాన్లీ, మరియు మింగ్-నా వెన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

కరాటే కిడ్‌: లెజెండ్స్ అనేది శక్తివంతమైన యాక్షన్‌తో పాటు భావోద్వేగాలు, సాంప్రదాయ విలువలు మరియు లెగసీకి గౌరవం తెలియజేసే విభిన్నమైన సినిమా అనుభవాన్ని అందించనుంది. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది.  — పాత తరం అభిమానులు మరియు కొత్త తరం ప్రేక్షకులందరిని ఈ సినిమా అలరిస్తుందనడంతో ఎటువంటి సందేహం లేదు.(Story : ‘కరాటే కిడ్‌: లెజెండ్స్‌’ ట్రైలర్‌ ) 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version