‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్ చేసే ఎంటర్టైనర్
ఈ మూవీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది?
-మేము టెలివిజన్లో డిఫరెంట్ షోస్ చేశాం. అప్పటినుంచి ప్రదీప్ గారు పరిచయం. ఆయన ఫస్ట్ సినిమాకి చివర్లో ఒక ప్రమోషన్ సాంగ్ షూట్ చేయాల్సి వచ్చింది. అది మాకు ఎక్సయిటింగ్ గా అనిపించింది. ప్రదీప్ గారితో చాలా క్రియేటివ్ థాట్స్ షేర్ చేసుకుంటాం. ఒకసారి ఈ ఐడియా చెప్పాము. బావుందన్నారు. తర్వాత బౌండ్ స్క్రిప్ట్ చేసి మొత్తం నరేషన్ ఇచ్చాం. ఆయనకు నచ్చింది. అలా ఈ మూవీ స్టార్ట్ అయింది.
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారి టైటిల్ కదా.. ఈ సినిమాకి ఎంత జస్టిఫికేషన్ గా ఉంటుంది?
-ఈ సినిమాకి ఈ టైటిల్ యాప్ట్ అవుతుంది కాబట్టే తీసుకున్నాను. ఇది పవన్ కళ్యాణ్ గారి టైటిల్. కచ్చితంగా పబ్లిసిటీ పరంగా ప్లస్ అవుతుంది. అయితే ఈ యాప్ట్ గా ఉండడం వల్లనే ఈ టైటిల్ ని తీసుకోవడం జరిగింది.
టీవీ నుంచి సినిమాలకి రావడం ఈ జర్నీ ఎలా ఉంది?
-ఇది బ్యూటిఫుల్ జర్నీ. టెలివిజన్ డిఫరెంట్, మూవీ డిఫరెంట్. ఫిక్షన్ కి నాన్ ఫిక్షన్ కి చాలా తేడా ఉంటుంది. మేము ఫిక్షన్ కి అసిస్టెంట్ డైరెక్టర్స్ గా కూడా పనిచేయలేదు. నాన్ ఫిక్షన్ లో జడ్జిమెంట్ ఈజీగా తెలుస్తుంది. కానీ సినిమా అలా కాదు.. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క పరిస్థితిలో షూట్ చేయాల్సి వస్తుంది. దాన్ని రియాక్షన్ ఎలా ఉంటుందో సినిమా రిలీజ్ అయినంత వరకు అర్థం కాదు. అయితే మాకు చాలా మంచి టీం ఉంది. మా డిఓపి బాల్ రెడ్డి గారు, మ్యూజిక్ రదన్ చాలా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. చాలా బాగా సపోర్ట్ చేశారు. మంచి టీం వర్క్ తో సినిమాని అద్భుతంగా చేసాం.
మీరు స్కిట్స్ ఎక్కువ చేసేవారు కదా.. దాని నుంచి ఏమైనా తీసుకున్నారా?
-ప్రతి స్కిట్ ఒక కథ. అయితే సినిమా కొంచెం పెద్ద కథ. ఇందులో కామెడీ అంతా కూడా చాలా సిచువేషనల్ గా ఉంటుంది. చాలా ఆర్గానిక్ గా ఉంటుంది. ఇందులో సిచువేషన్ కామెడీ ఎక్కువగా ఉంటుంది, ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ లాగా ఉంటుంది.
-బ్రహ్మానందం గారు. సత్య గారు పాత్రలన్నీ కథలో ఆర్గానిక్ గా ఉంటాయి. ఆ పాత్రలని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు.
హీరోయిన్ దీపిక పిల్లి క్యారెక్టర్ గురించి?
-ఒక తెలుగు అమ్మాయితో ఈ క్యారెక్టర్ ని చేయించాలనుకున్నాం. దానికి తగ్గట్టే ఆడిషన్ చేసాం. ఆ పాత్రకు తను పర్ఫెక్ట్ గా ఫిట్ అయింది. తన క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
మైత్రి మూవీ మేకర్స్ కి చూపించి రిలీజ్ చేస్తున్నారా?
-మైత్రి మూవీ మేకర్స్ సినిమాని చూశారు. వారికి సినిమా చాలా నచ్చింది. సినిమాలో చాలా పొటెన్షియల్ ఉందని చెప్పారు. ఇది సమ్మర్ కి రావాల్సింది సినిమా అని వారే రిలీజ్ డేట్ ఆలోచించి ఫిక్స్ చేశారు. వారే మా ఫస్ట్ ఆడియన్స్. వారి రియాక్షన్ చూసిన తర్వాత మాకు చాలా ఆనందంగా అనిపించింది.
-ఈ సమ్మర్ లో ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఖచ్చితంగా అందరిని ఎంటర్టైన్ చేస్తుంది.
నిర్మాతల సపోర్ట్ గురించి ?
-ప్రదీప్ గారి ఫ్రెండ్స్ అందరూ కలిసి చేశారు. నిర్మాతల నుంచి చాలా సపోర్ట్ వుంది. మేము అడిగినదంతా ఇచ్చారు.
రధన్ మ్యూజిక్ గురించి?
-రధన్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో మంచి డాన్స్ నంబర్స్ ఉన్నాయి. ప్రదీప్ గారు చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. తనని డిఫరెంట్ గా ప్రొజెక్ట్ చేసాము. రధన్ గారు సినిమా సోల్ కి తగ్గ మ్యూజిక్ ఇచ్చారు. కథకి చాలా పర్సనల్ గా కనెక్ట్ అయి మ్యూజిక్ చేశారు. అలాగే శేఖర్ మాస్టర్ గారి కొరియోగ్రఫీకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
డైరెక్టర్స్ గా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారా?
-కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. రిలీజ్ తర్వాత వాటి గురించి ఆలోచించాలి.
ఆల్ ది బెస్ట్
-థాంక్ యూ (Story :’అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్ చేసే ఎంటర్‌టైనర్)