బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా నిరసనలు
న్యూస్‌తెలుగు/వనపర్తి : బంగ్లాదేశ్ లో ఇస్కాన్ దేవాలయ చిన్మయ్ కృష్ణదాస్ ను అరెస్టు చేసి, హిందూ ఆలయాలపై దాడులను ఖండిస్తూ వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలో బంగ్లాదేశ్ ప్రధాని చిత్రపటానికి చెప్పులదండ వేసి స్థానిక సుభాష్ చంద్రబోస్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీగా బయలుదేరి బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. అనంతరం స్థానిక సుభాష్ చంద్రబోస్ దగ్గర బంగ్లాదేశ్ ప్రధాని చిత్రపటానికి నిప్పు పెట్టి చౌరస్తాలో నిరసన కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘం నాయకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో జరుగుతున్న అరెస్టులు దాడులు ఆపాలని, ఇలాగే కొనసాగితే బంగ్లాదేశ్ అనే దేశం లేకుండా చేస్తామని హిందూ సంఘం నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెబ్బేరు హిందూ జాగృతం సభ్యులు పాల్గొన్నారు. (Story : బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా నిరసనలు)