పార్టీలకతీతంగా ప్రజలందరూ శ్యామలాంబ పండగను విజయవంతం చేయాలి
న్యూస్ తెలుగు /సాలూరు :పార్టీలకు అతీతంగా పట్టణ ప్రజలందరూ శ్యామలాంబ పండగను విజయవంతం చేయాలని అందులో భాగంగానే శ్యామలాంబ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. గురువారం సాలూరు. శ్యామలాంబ అమ్మవారి ఆలయంలో నూతనంగా ఏర్పాటుచేసిన కమిటీ వారితో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
పార్టీలకు అతీతంగా అందరం కలిసి పండగ విజయవంతంగా జరుపుకుందాం అని తెలియజేశారు.
ఆ తల్లి పండుగ జరుపుకుంటే నియోజకవర్గం అంతా చల్లగా ఉంటుందని ఆమె అన్నారు.
ముఖ్యంగా పండగ సమయంలో నీటి సమస్య, విద్యుత్ సమస్య లేకుండా చూసుకుందామని ఆమెతెలిపారు
ప్రతి వార్డులో నీటి సమస్య లేకుండా వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయం అనువంశిక ధర్మకర్త విక్రమచంద్ర సన్యాసిరాజు యువరాజు మాజీ ఎమ్మెల్యే ఆర్ పి భంజ్ దేవ్ శ్యామలాంబ ఉత్సవ కమిటీ చైర్మన్ అక్కెన అప్పారావు సాలూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మది తిరుపతిరావు ప్రజలు పాల్గొన్నారు. (Story :పార్టీలకతీతంగా ప్రజలందరూ శ్యామలాంబ పండగను విజయవంతం చేయాలి)