ఘనంగా కార్తీక పోలీ స్వర్గ పూజ
న్యూస్‌తెలుగు/ వినుకొండ : స్థానిక కొత్తపేటకొని సురేష్ మహల్ రోడ్ లోని శ్రీ కాశి విశ్వేశ్వర ఆలయం ఆవరణలో కార్తీక మాస సమారాధనలో భాగంగా గత నెల రోజుల నుండి ఆలయంలో విశేషమైన పూజలు నిర్వహిస్తూ సోమవారం తెల్లవారుజామున నుండి సర్వకుల సర్వమత మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పోలీ స్వర్గ పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు ప్రముఖ సీనియర్ న్యాయవాది సిహెచ్ మూర్తి మాట్లాడుతూ. సర్వ కుల సర్వమత ప్రోత్సహించే దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు, కళాకారులు, న్యాయవాదులు, పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం తీర్థప్రసాదాలు భక్తులకు అందజేశారు. (Story: ఘనంగా కార్తీక పోలీ స్వర్గ పూజ)