హరిచంద్రపురం నకరికల్లు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాలి
పల్నాడు జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము.
న్యూస్‌తెలుగు/ వినుకొండ : సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి ఆధ్వర్యంలో హరిచంద్రపురం నకరికల్లు ఎత్తిపోతల పథకం వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ అరుణ్ బాబు కి సోమవారం అర్జీ ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ. ప్రస్తుత కూటమి ప్రభుత్వం 2014వ సంవత్సరంలో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నదులను అనుసంధానం చేసి నీటిని సముద్రం పాలు కాకుండా రైతులకు ప్రజలకు ఉపయోగపడాలని ఆలోచనతో కృష్ణ, గోదావరి, పెన్నా నదులను అనుసంధానం చేసే క్రమంలో హరిచంద్రపురం వద్ద నుండి సుమారు 80 కిలోమీటర్లు కాలువ కానీ పైపులేను కానీ వేసి నకరికల్లు వద్ద ఉన్న నాగార్జునసాగర్ కుడి కాలువలో ఎత్తిపోసే పథకాన్ని 2016, 2017 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. కొంత బడ్జెట్ను కూడా కేటాయించడం జరిగింది. ఈ విషయాన్ని టీవీల్లో పత్రికల్లో చూసిన రైతులు, ప్రజలు ఆనందించారు. ఈ పథకం ద్వారా కుడి కాలువ ఆయకట్టు ప్రవహించే పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాలో సుమారు పది లక్షల ఎకరాలకు సాగునీరు , మూడు జిల్లాల ప్రజలకు తాగునీరు వస్తుందని, అటు నాగార్జునసాగర్ ద్వారా ఇటువైపు హరిచంద్రపురం నకరికల్లు ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు కావాల్సినంత నీరు అందుతుందని డెల్టా ప్రాంతం లాగా నాగార్జునసాగర్ కుడి కాలువ పరిధిలో సాగు చేసుకునే రైతులందరికీ రెండు పంటలు సాగు చేసుకునే అవకాశం కలుగుతుందని ఆనందంతో ఉబ్బి తబ్బి అయిపోయారు. అదేవిధంగా మూడు జిల్లాల ప్రజలకు తాగునీరుకు ఇబ్బంది లేకుండా ఉంటుందని ప్రజలు రైతులు వేయికళ్లతో ఎదురు చూశారు అయితే 2019 సంవత్సరంలో టిడిపి ప్రభుత్వం ఓడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది వారు అధికారంలోకి రాగానే ఈ పథకం పేరు మార్చేసి. డాక్టర్ వైయస్సార్ పల్నాడు జిల్లా. కరువు నివారణ వికేంద్రీకరణ.పథకం గా పేరు మార్చడం జరిగింది అప్పటినుండి ఇప్పటివరకు ఈ పథకాన్ని పట్టించుకున్న నాధుడే లేడు. మళ్లీ 2024లో టిడిపి పార్టీ కూటమి ప్రభుత్వంగా ఏర్పడటంతో ఈ మూడు జిల్లాల ప్రజలకు మళ్లీ ఆశలు చిగురించుకున్నాయి కావున కామందుల వారు మూడు జిల్లాల రైతులను ప్రజలను దృష్టిలో పెట్టుకొని . రైతులకు సాగు ప్రజలకు తాగునీరు అందించే ఈ పథకం త్వర్తిగతిన పూర్తి చేయవలచిన ఆవశ్యకత ఉన్నది. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వర్షాలు తక్కువ పడి నీటి ప్రభావం తగ్గటం ఎగువ రాష్ట్రం కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాములు నిండి మనకు కృష్ణ నది ప్రవాహము తగ్గడం తో సకాలంలో కుడి కాల్వకు సాగు నీరు విడుదల కాక పోవడంతో వ్యవసాయమే జీవనాతనంగా బ్రతుకుతున్న రైతులకు జీవనం కష్టంగా మారుతుంది. సాగర్ కుడికాలువ ఆయకట్టు పరిధిలోని రైతులకు సకాలంలో పంటలు సాగు చేసేందుకు గోదావరి జలాల అందించవలసిన ఆవశ్యకత ఉన్నది. మా యందు దయ ఉంచి త్వరితన సాగర్ కుడి కాలువకు గోదావరి జలాలు తరలించే విధంగా ప్రత్యేక శ్రద్ధ చూపాలని . పైన తెలిపిన విషయాలన్నీ కలెక్టర్ కి రాము వివరించడం జరిగింది కలెక్టర్ ని కలిసిన బృందంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు తాళ్లూరి బాబురావు, కౌలు రైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి, అప్ప రాజు పవన్ కుమార్, చిన్న సైదా ఉన్నారు. (Story : హరిచంద్రపురం నకరికల్లు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాలి)

