UA-35385725-1 UA-35385725-1

రైతు పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రైతన్నలకు కృతజ్ఞతలు

రైతు పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రైతన్నలకు కృతజ్ఞతలు

న్యూస్ తెలుగు/వనపర్తి : మహబూబ్ నగర్ జిల్లా రైతుల పండుగ విజయోత్స వేడుకలో మన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి రైతుల తరఫున వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 25 లక్షల మంది రైతు కుటుంబాలకు 21 వేల కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ చేసిన చరిత్ర దేశంలోనే ఏదైనా రాష్ట్రం ఉందంటే అది తెలంగాణ ప్రజా ప్రభుత్వం మాత్రమేనని ఎమ్మెల్యే అన్నారు.ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో మూడు రోజులపాటు జరిగిన రైతు పండుగ ముగింపు కార్యక్రమంలో రైతన్నలు పెద్ద ఎత్తున పాల్గొన్నారనీ ఆయన పేర్కొన్నారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రివర్గ సహచరులు, సలహాదారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. దాదాపు 18 వేల కోట్ల రూపాయలతో 22 లక్షల రైతు కుటుంబాలకు ఇప్పటికే రుణమాఫీ చేయగా, తాజాగా ఈ వేదిక నుంచి మరో 3,13,897 మంది రైతు కుటుంబాలకు రుణ మాఫీ చేస్తూ అందుకు అవసరమైన 2747.67 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి గారు విడుదల చేశారు.తాజాగా విడుదల చేసిన నిధులతో రాష్ట్రంలో మొత్తంగా 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ జరిగింది.ఈ నిధులను విడుదల చేయడంతో పాటు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎంగారు వర్చువల్ గా ప్రారంభించారు.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహిళా సమాఖ్య కోసం 255 కోట్ల రూపాయలను విడుదల చేశారు.ప్రజా ప్రభుత్వానికి ఇకనుంచి రైతులే బ్రాండ్ అంబాసిడర్లు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు పారనప్పటికీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడూ లేనంతగా, ఏ రాష్ట్రం ఉత్పత్తి చేయనంతగా 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి రికార్డు సృష్టించామని అన్నారు.(Story : రైతు పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రైతన్నలకు కృతజ్ఞతలు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1