Home ఒపీనియన్‌ పంటకాలువ ఏర్పాటుకు క్షేత్ర పరిశీలన చేసిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి

పంటకాలువ ఏర్పాటుకు క్షేత్ర పరిశీలన చేసిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి

0

పంటకాలువ ఏర్పాటుకు క్షేత్ర పరిశీలన చేసిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి

న్యూస్ తెలుగు/ వనపర్తి : పెద్దమందడి మండలం బుద్ధారం రైట్ కెనాల్ పామిరెడ్డిపల్లి గ్రామ శివారు నుంచి దొడగుంటపల్లి, చిన్నమందడి గ్రామాలకు సాగునీరు అందించేందుకు కావలసిన పంట కాలువ ఏర్పాటుకు శుక్రవారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆయా గ్రామాల రైతులతో కలిసి క్షేత్ర పరిశీలన చేశారు. ఈ కాలువ ఏర్పాటుతో పామిరెడ్డిపల్లి, ముందర తండా, చిన్నమందడి, దొడగుంటపల్లి గ్రామాలకు సంబంధించిన పలు కుంటలకు సాగునీరు చేరుతుందని దాంతో 300 పై చీలుకు ఎకరాలకు సాగునీరు అందుతుందని ఈ కాలువ ఏర్పాటుకు పెద్దమనుసుతో రైతులు సహకరించాలని ఎమ్మెల్యే సూచించారు. కాలువ ఏర్పాట్లో కోల్పోయిన భూమికి సైతం ప్రభుత్వపరంగా నష్టపరిహారం అందిస్తామని రైతులెవరు అధైర్య పడకూడదని ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా కాలువ ఏర్పాటుకు పూర్తిస్థాయి సర్వే నిర్వహించి నివేదిక సమర్పించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి గారు, పెద్దమందడి మండల మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్ గారు, పామిరెడ్డిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ సిద్దయ్య గారు, చీకరుచెట్టు తండా గ్రామ మాజీ సర్పంచ్ రాధాకృష్ణ,కాంగ్రెస్ నాయకులు దొడగుంటపల్లి వెంకటేశ్వర రెడ్డి, పామిరెడ్డిపల్లి మధిర శ్రీశైలం, చందు, భాస్కర్ రెడ్డి, పాపిరెడ్డి, చిన్నమందడి గ్రామ మాజీ ఉపసర్పంచ్ డి శ్రీనివాస్, వీరాయిపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు చిట్యాల వెంకటయ్య, రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(Story : పంటకాలువ ఏర్పాటుకు క్షేత్ర పరిశీలన చేసిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version