“అఖిలభారత పద్మశాలి సంఘం” రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులుగా అనుముల నాగప్రసాదరావు
న్యూస్ తెలుగు/వినుకొండ : విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన మండపంలో అఖిల భారత పద్మశాలి సంఘానికి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ నియామకాలు చేపట్టగా, పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన అనుముల నాగ ప్రసాదరావు ని రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులుగా నియమించి ప్రమాణ స్వీకారం చేయించారు.అనంతరం సమావేశంలో పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ పరిధిలో గత నెల 9వ తేదీన జరిగిన జంట హత్యల ఘటనపై చర్చ జరిగింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చర్లగుడిపాడు గ్రామానికి చెందిన కాకుమాను భావనరుషి మరియు జంగమేశ్వరపురానికి చెందిన భువనగిరి శ్రీనివాస్ కుటుంబాలు ఆర్థికంగా బలహీనంగా ఉన్నందున, ఆ కుటుంబాలకు ప్రభుత్వ పరంగా తగిన ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందకట్ల స్వామి కి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ కుటుంబాల తరఫున అనుముల నాగ ప్రసాదరావు, చేఫూరి రంగారావు, మాఘం ఏడుకొండలు, మాఘం శ్రీను తదితరులు పాల్గొన్నారు.(Story : “అఖిలభారత పద్మశాలి సంఘం” రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులుగా అనుముల నాగప్రసాదరావు )
