టీ దుకాణాల యజమానులకు అవగాహన కార్యక్రమం
న్యూస్ తెలుగు/వినుకొండ : పట్టణంలో పర్యావరణ అనుకూలతను పెంపొందించే దిశగా టీ దుకాణాల వద్ద వాడిపడేసే టీ కప్పుల ద్వారా ఉత్పన్నమయ్యే అపరిశుభ్రత అసౌకర్యం మీద చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జి వి ఆంజనేయులు సూచన మేరకు వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ గణనీయమైన ముందడుగు వేసి టీ దుకాణాల యజమానులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు.టీ స్టాల్ యజమానులను ఉద్దేశించి మాట్లాడుతూ. పేపర్ కప్పుల నుండి గ్లాస్ కప్పులకు మారాలని కస్టమర్లలో అవగాహన పెంచేందుకు, టీ స్టాల్ యజమానులు చిన్న బ్యానర్లను ప్రదర్శించాలని డిస్పోజబుల్ పేపర్ కప్పుల వినియోగాన్ని తగ్గించడం గ్లాస్ మరియు మట్టి ఆధారిత టీ కప్పుల అభ్యాసాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తొలిఅడుగు వేయాలని టీ దుకాణాల యజమానులకు సూచించారు. కారంపూడి రోడ్ చైతన్య గోదావరి బ్యాంకు వద్ద వినియోగదారులకు పర్యావరణ స్పృహను కల్పించు విధంగా చిన్న ఫ్లెక్సీ ఏర్పాటు చేసి మైక్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న టీ షాప్ యజమాని కరిముల్లా ఉన్నతమైన ఆలోచనను శ్లాఘించారు.అందరూ కరీముల్లా మాదిరిగా పర్యావరణ హితంగా ఆలోచించి పట్టణ పరిశుభ్రతకు సహకరించాలని కోరారు. ఈ మార్పును అమలు చేయడం ద్వారా వినుకొండ మరింత పర్యావరణ స్పృహతో కూడిన భవిష్యత్తు దిశగా పయనిస్తోందని అభిప్రాయపడ్డారు.(Story : టీ దుకాణాల యజమానులకు అవగాహన కార్యక్రమం)