పలు శుభకార్యాలకు కార్తీక మాస సత్యనారాయణ వ్రతం శుభసూచకం
న్యూస్‌తెలుగు/ వనపర్తి : కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం శుభసూచకం అని నందిమల్ల.అశోక్ గురుస్వామి అన్నారు. ముత్తు కృష్ణ గురుస్వామి ఆధ్వర్యములో నందిమల్ల.శారద అశోక్ దంపతులు తమ స్వగృహంలో సత్యనారాయణ స్వామి వ్రతము నిర్వహించి అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా నందిమల్ల.అశోక్ మాట్లాడుతూ అయ్యప్పస్వామి మాల అత్యంత పవిత్రమైంది కఠోర దీక్షతో అయ్యప్పస్వామి కరుణాకటాక్షాలు కలుగుతాయని 41 రోజుల దీక్షతో ఆరోగ్యపరంగా దృఢంగా ఉండి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తామని అన్నారు. మాన్యశ్రీ గోపాల్ శర్మ గురుస్వామి ఆధ్వర్యములో 18సంవత్సరాలు మాలధారణ పూర్తి చేసుకున్న ముమ్మడి.రాఘవేంద్ర స్వామి పడిపూజ బ్రహ్మం గారి దేవాలయములో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సంపూర్ణ గురుస్వామిగా మారిన రాఘవేంద్ర స్వామికి గోపాల్ శర్మ గురుస్వామి గారు మంత్రోపదేశం చేసి ఘనంగా పడిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర గురుస్వామిని ముత్తు కృష్ణ,వాకిటి.శ్రీధర్,కాగితాల.లక్ష్మినారాయణ, నందిమల్ల.అశోక్ గురుస్వాములు ఘనంగా సన్మానించారు. (Story : పలు శుభకార్యాలకు కార్తీక మాస సత్యనారాయణ వ్రతం శుభసూచకం)