Home వార్తలు టిడ్కో ఇళ్ళు లబ్ధిదారులకు అందజేస్తాం

టిడ్కో ఇళ్ళు లబ్ధిదారులకు అందజేస్తాం

0

టిడ్కో ఇళ్ళు లబ్ధిదారులకు అందజేస్తాం

 మున్సిపల్ కమిషనర్

న్యూస్ తెలుగు / వినుకొండ :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న టిడ్కో ఇండ్ల నిర్మాణం పట్టణ పేదవాడి సొంతింటి కల సాకారానికి సంకల్పించి శీఘ్రగతిన లబ్ధిదారులకు అందజేయాలన్న చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జి వి ఆంజనేయులు ఆదేశానుసారం. వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన -ఎన్టీఆర్ నగర్-ఆంధ్రప్రదేశ్ టిడ్కో ఇండ్ల పురోగతిని పరిశీలించారు. అనంతరం ప్రధానమంత్రి ఆవాస్ యోజన యొక్క అఫర్డబుల్ హౌసింగ్ పార్ట్నర్షిప్ ఏ హెచ్ పి విభాగం పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాల ద్వారా సరసమైన గృహాల నిర్మాణములపై దృష్టి పెడుతుందని తెలిపారు . ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆంధ్ర ప్రదేశ్ టౌన్‌షిప్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ( ఏపిటిఐడిసిఓ )- ఏ హెచ్ పి పథకంను అమలు చేయడానికి బాధ్యత వహిస్తుందని తెలిపారు. టిడ్కో ఇండ్ల నిర్మాణ పురోగతి, పని నాణ్యత మరియు పి ఎం ఏ వై మార్గదర్శకాలకు లోబడి జరుగుతున్న పనితీరుని కమిషనర్ సుభాష్ చంద్రబోస్ బేరీజు వేశారు. వినుకొండ పట్టణం టిడ్కో హౌసెస్లో రెండు కేటగిరిలున్నవి. 300 స్క్వేర్ ఫీట్స్ విభాగంలో 864 హౌసెస్,430 స్క్వేర్ ఫీట్స్ విభాగంలో 576 హౌసెస్ మొత్తంగా 1440 టిడ్కో ఇండ్ల ద్వారా ఆర్థికంగా వెనుకబడ్డ వారికి లబ్ధి చేకూరుచున్నదని అన్నారు .టిడ్కో గృహాల ప్రస్తుత నిర్మాణ స్థితిని పరిగణలోకి తీసుకున్నట్లయితే 300 స్క్వేర్ ఫీట్స్ విస్తీర్ణం గల 864 ఇండ్లకు గాను రివర్స్ ట్రెండింగ్ ద్వారా నూతన కాంట్రాక్టర్ ఐజెయం-ఇంద్రజిత్ మెహతా కన్స్ట్రక్షన్ కంపెనీ ద్వారా 720 ఇండ్లు నిర్మాణదశలో ఉన్నవని అలాగే 430 స్క్వేర్ ఫీట్స్ విస్తీర్ణం గల 576ఇండ్లకు కాను 60 ఇండ్ల నిర్మాణము పూర్తి దశకు చేరుకున్నవని మిగిలిన ఇండ్ల నిర్మాణము కొరకు కాంట్రాక్టరుపై వత్తిడి తేనున్నట్టు కమీషనర్ తెలిపారు. అలాగే టిడ్కో ఇండ్ల రిజిస్ట్రేషన్ పరిస్థితిని గమనించినట్లయితే 300 స్క్వేర్ ఫీట్స్ ఇండ్లలో 864 కాను 220 ఇండ్లకు రిజిస్ట్రేషన్ పూర్తి చేయబడ్డవని అలాగే 430 స్క్వేర్ ఫీట్స్ ఇండ్లలో 576 గాను 30 ఇండ్లకు బ్యాంకుల ద్వారా 81లక్షల రూపాయలు లోన్లు మంజూరు చేయడం జరిగిందని వివరించారు.టిడ్కో ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారుని సహకారాన్ని పరిశీలించినట్లయితే 300 స్క్వేర్ ఫీట్ల ఇండ్ల నిర్మాణానికి ప్రతి లబ్ధిదారుడు ఒక రూపాయి చొప్పున సహకరించడం జరిగిందని అలాగే 430 స్క్వేర్ ఫీట్ల ఇండ్ల నిర్మాణం విభాగంలో 300ఇండ్లకు గాను ఒక్కొక్క లబ్ధిదారుడు రెండు వాయిదాల పద్ధతిలో 50 వేల రూపాయలు చెల్లించడం జరిగిందని 125 ఇండ్లకు గాను ఒక్క వాయిదా పద్ధతిలో 25 వేల రూపాయలు చెల్లించడం జరిగిందని 151 ఇండ్లకు లబ్ధిదారులు ఎటువంటి పేమెంట్ జరుపలేదని చెప్పారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన -ఎన్టీఆర్ నగర్-ఆంధ్రప్రదేశ్ టిడ్కో ( ఏ హెచ్ పి ) హౌసింగ్ ప్రాజెక్ట్ వినుకొండ పట్టణములోని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు మెరుగైన గృహాలను అందించగలదని భావిస్తున్నామని కమీషనర్ ఒక ప్రకటనలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. (Story : టిడ్కో ఇళ్ళు లబ్ధిదారులకు అందజేస్తాం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version