UA-35385725-1 UA-35385725-1

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సమస్యలను పరిష్కరిస్తాం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సమస్యలను పరిష్కరిస్తాం

విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్నీ)

న్యూస్‌ తెలుగు/విజయవాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని ఎంపీ కేశినేని శివనాథ్‌ అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో ఎంపీ, ఎమ్మెల్యే సత్యనారాయణ చౌదరి(సుజనా చౌదరి) విజయవాడ నగర అభివృద్ధిపై నగరపాలక సంస్థ కమిషనర్‌ ధ్యానచంద్ర, వివిధ శాఖాధిపతులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరాభివృద్ధి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంట్‌లో చర్చించి కేంద్ర ప్రభుత్వం నుండి నిధులను సమకూర్చే దిశగా చర్చించారు. అందులో భాగంగా రైల్వే అండర్‌ బ్రిడ్జ్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్‌, బీఆర్‌టీఎస్‌ రోడ్‌ నుండి రైల్వే స్టేషన్‌ వరకు వెళ్ళేందుకు కావాల్సిన ప్రణాళిక, ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు సింగ్‌నగర్‌, రాజరాజేశ్వరిపేట నుండి ఎర్రకట్టు వెళ్ళేందుకు బ్రిడ్జిలు నిర్మించే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ పార్లమెంటు పరిధిలోని ప్రధాన ప్రాంతాలు, శివారు, కొండ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. కార్పొరేషన్‌కు ఆదాయం తెచ్చే విభాగాలన్నీ నిర్ణీత వార్షిక లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నించాలన్నారు. రాబడి పెరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో విజయవాడను స్మార్ట్‌ సిటీగా తయారు చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని, విజయవాడలో క్రీడలు క్రీడలను ప్రోత్సహించేందుకు స్టేడియంలను అభివృద్ధి పర్చాల్సి ఉందన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరాభివృద్ధిపై పూర్తి దృష్టి సారించడంతో పాటు రోడ్లు, రైల్వే బ్రిడ్జిలు, శానిటేషన్‌, స్మార్ట్‌ టాయిలెట్లు, స్ట్రామ్‌ వాటర్‌ డ్రైయిన్ల ఏర్పాటుతో పాటు ప్లాంటేషన్‌, బ్యూటిఫికేషన్‌ వంటి పలు సుందరీకరణలను చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రజలకు మౌలిక వసతులు మరింత మెరుగుపర్చాలని, ప్రజల సమస్య తీర్చేందుకు ఆయా శాఖల మధ్యలో సమన్వయం ఎంతో అవసరమన్నారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ నగరాభివృద్ధికి అధికారులందరూ సమిష్టో కృషితో పని చేస్తున్నారని, నగరంలో వీఎంసీ చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయా శాఖలు చేపడుతున్నాయని, ప్రజలు కూడా ఖాళీ స్థల, ఆస్తి, పన్నులు సకాలంలో చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఏడీజే డా.చంద్రశేఖర్‌, సీఈ శ్రీనాథ్‌రెడ్డి, సీపీ ప్రసాద్‌, ఇంచార్జ్‌ సీఎంవోహెచ్‌ డా.సురేష్‌బాబు, డీసీఆర్‌ సృజన, ఎస్‌ఈ సత్యకుమారి, అమృత్‌ పథకం జేడీ డాక్టర్‌ లత, ఎకౌంట్స్‌ ఆఫీసర్‌ సత్యనారాయణ పాల్గొన్నారు. (Story : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సమస్యలను పరిష్కరిస్తాం )

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1