Home వార్తలు పూజా కార్యక్రమాలతో జిపిఎల్ (గాడ్స్ ప్రీమియర్ లీగ్) చిత్రం ప్రారంభం  !!!

పూజా కార్యక్రమాలతో జిపిఎల్ (గాడ్స్ ప్రీమియర్ లీగ్) చిత్రం ప్రారంభం  !!!

0

పూజా కార్యక్రమాలతో జిపిఎల్ (గాడ్స్ ప్రీమియర్ లీగ్) చిత్రం ప్రారంభం  !!!

అల్లు ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్స్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న చిత్రం జి.పి.ఎల్. అల్లు లత  ప్రేసెన్స్ తో అల్లు సాయి లక్ష్మణ్ నిర్మాతగా రావు జి.ఎం నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో జరిగాయి.
పవన్ శంకర్, యాని,  తనికెళ్ళ భరణి, హెబ్బ పటేల్, బ్రహ్మాజీ, నాగ మహేష్ , నవీన్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
లవ్ ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా హైదరాబాద్ మరియు వైజాగ్, కోడై కెనాల్ లో జరగనుంది. నవంబర్ 14 నుండి మొదటి షెడ్యూల్ ప్రారంభం కానుంది.
డైరెక్టర్ రావు జి.ఎం.నాయుడు మాట్లాడుతూ…
పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా నేను ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాను. జి.పి.ఎల్ (గాడ్స్ ప్రీమియర్ లీగ్) టైటిల్ ఈ కథకు సరిగ్గా సరిపోతుంది… మనం ఏదైనా పైన ఉన్న భగవంతుడి ఆదేశాల మేరకు నడుస్తాము అనే పాయింట్ తో ఈ సినిమా కథాంశం ఉండబోతోందని తెలిపారు.
నిర్మాత అల్లు సాయి లక్ష్మణ్ మాట్లాడుతూ…
జి.పి.ఎల్ (గాడ్స్ ప్రీమియర్ లీగ్) సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుంది. లవ్, సస్పెన్స్ తో కూడిన ఈ సినిమా షూటింగ్ సింగల్ షెడ్యూల్ లో పూర్తి చేయబోతున్నాము, మాకు సహకరిస్తున్న మీడియా వారందరికీ ప్రేత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అన్నారు
నటీనటులు:
పవన్ శంకర్, యాని,  తనికెళ్ళ భరణి, హెబ్బ పటేల్, బ్రహ్మాజీ, నాగ మహేష్ , నవీన్ తదితరులు
టెక్నీషియన్స్:
బ్యానర్: అల్లు ఆర్ట్స్
నిర్మాత: అల్లు సాయి లక్ష్మణ్
దర్శకత్వం: రావు జి.ఎమ్ నాయుడు
కెమెరామెన్: రామ్ కంద
సంగీతం: మణిశర్మ
చీఫ్ అసోసియేట్: శివ వేములవాడ (Story : పూజా కార్యక్రమాలతో జిపిఎల్ (గాడ్స్ ప్రీమియర్ లీగ్) చిత్రం ప్రారంభం  !!!)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version