రైతు పండించిన పంట వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించాలి
బీఆర్ఎస్ పార్టీ డిమాండ్
న్యూస్‌తెలుగు/ వనపర్తి : రైతులు పండించిన పంట వేరుశనగకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించడం లేదని రైతుల పక్షాన వనపర్తి లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ దగ్గరకు టిఆర్ఎస్ పార్టీ నేతలు వెళ్లి మార్కెట్ కు తీసుకువచ్చిన ధాన్యానికి వేరుశనగ పంట రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వాన్ని నిలదీశారు, రైతులు అందరూ వచ్చి గతంలో పండించిన పంటలకు పల్లికి క్వింటాలుకు 7000 పైబడే ఉండేవని, కానీ ఇప్పుడు క్వింటాలుకు 5,300 రూపాయలకే కొంటున్నారు, రైతులు పల్లి విత్తనాలు కొన్నప్పుడు 12 వేల నుండి 18 వేల వరకు రైతులకు అమ్ముతారు, ఇప్పుడు మేము పండించిన పంటలకు పల్లికి 5300 రూపాయలకే కొంటున్నారు ఇదెక్కడి న్యాయం అనీ ప్రభుత్వాన్ని విమర్శించారు,
ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వకపోతే లక్షల్లోనే నష్టం జరుగుతుంది మేము ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము అని రైతులు ఆవేదనతో తెలిపారు ప్రభుత్వం అధికారులతో చర్చించి రైతులకు నష్టం జరగకుండా మద్దతు ధర కల్పించుటకు ఏర్పాటు చేయాలని వరి కొనుగోలు కేంద్రాల్లో జాప్యం జరగకుండా, వరికి మద్దతు ధర 2,800 ఉండగా క్వింటాలుకు 2050 రూపాయలకే కొనుగోలు చేయుచున్నారని రైతుల కష్టాలు వారు పండించిన పంటకు సరియైన మద్దతు ధర కల్పించాలని లేనిచో రైతుల పక్షాన రైతులతో మార్కెట్ కార్యాలయాలు ముట్టడిస్తామని బీఆర్ఎస్ పార్టీ నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్, రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ విజయకుమార్, సింగిల్ విండో అధ్యక్షులు రఘు వర్ధన్ రెడ్డి, వాసుదేవ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులుమాణిక్యం,వనపర్తి పట్టణ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి,
మున్సిపల్ కౌన్సిలర్లు పెండెం నాగన్న యాదవ్, రహీం నుసరత్నిసా బేగం, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గులాం ఖాదర్ ఖాన్, బీఆర్ఎస్ పార్టీ వనపర్తి మండల యువత అధ్యక్షులు చిట్యాల రాము, బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మాధవరెడ్డి, ఆశన్న నాయుడు, గుద్దేటి బాలస్వామి, దడవాయి ఈశ్వరయ్య, రైతులు పాల్గొన్నారు (Story : రైతు పండించిన పంట వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించాలి)