శానిటేషన్ వర్కర్స్ కు పెండింగ్ వేతనాలు చెల్లించండి
యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు నాగవేణి, లక్ష్మీదేవి
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్ కు పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని యూనియన్ నాయకులు నాగవేణి ,లక్ష్మీదేవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో ఆర్డీవో మహేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం యూనియన్ నాయకులతోపాటు సిఐటియు నాయకులు అయూబ్ కాన్ , ఆదినారాయణ మాట్లాడుతూ ధర్మవరం రెవిన్యూ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్ (ఆయాలకు) పెండింగ్లో ఉన్న నాలుగు నెలల వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతనాలు రాకపోవడంతో వారి కుటుంబాలు ఆర్థికంగా అనేక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని, నిత్యవసర వస్తువుల ధరలు నిరంతరం పెరగడంతో కార్మికుల కుటుంబాలు ఏమి కొనేటట్లు కానీ, ఏమి తినేటట్లు కానీ లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యంగా వారికి ప్రభుత్వం కేవలం 6000 రూపాయలు మాత్రం వేతనాలు ఇస్తున్నాదని, చాలీచాలని వేతనాలతో వారి కుటుంబాలు గడవడం చాలా దారుణంగా ఉన్నాయన్నారు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, పి.ఎఫ్. ఈ.ఎస్.ఐ. సౌకర్యాలను కల్పించి,సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. తొలుత ఆర్డిఓ కార్యాలయ ఆవరణ ముందు ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో
యూనియన్ నాయకులు చౌడమ్మ, జయమ్మ, అంజనమ్మ వరలక్ష్మి, ఫరాన, తదితర కార్మికులు పాల్గొన్నారు. (Story : శానిటేషన్ వర్కర్స్ కు పెండింగ్ వేతనాలు చెల్లించండి)