35 బియ్యం బస్తాలు వితరణ
న్యూస్‌తెలుగు/ విజయనగరం జిల్లా : ఆర్యవైశ్య మిత్రుల చారిటీ గ్రూప్ ద్వారా 35 బస్తాలు బియ్యం అన్న క్రతువుకు వితరణ చేశారు. స్థానిక శ్రీ పంచముఖ ఆంజనేయ నిత్య అన్న ప్రసాద వితరణ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయ్యప్ప మాలాదారుల కోసం నిర్వహించబడుతున్న మహా అన్నదాన క్రతువుకు శుక్రవారం 35 బస్తాలు బియ్యం మిత్రుల సహకారంతో అందజేసినట్లు చారిటీ గ్రూప్ అధ్యక్షుడు ఆలవెళ్లి శేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ధికంగా వెనుకబడిన వారికి విద్య,వైద్యం, వివాహం నిమిత్తం చారిటీ గ్రూప్ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ కార్యదర్శి డిమ్స్ రాజు, కోశాధికారి సముద్రాల నాగరాజు, బి.వి.పి.ఎస్. రామయ్య, మాచర్ల చంద్రశేఖర్ గుప్తా, కల్లూరి సతీష్, దేవాలయం కార్యదర్శి పెంటపాటి కామరాజు, కంది మురళీ నాయుడు స్వామి, సునీల్, రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (Story : 35 బియ్యం బస్తాలు వితరణ)