వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ను కలిసిన రాష్ట్ర అధ్యక్షులు మాచర్ల బుజ్జి
న్యూస్‌తెలుగు/వినుకొండ : సచివాలయంలోని వైద్య, విద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ ఛాంబర్ లో ఆంధ్రప్రదేశ్ దళిత గిరిజన వైద్య మిత్ర దళిత గిరిజన కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు మాచర్ల బుజ్జి ఆధ్వర్యంలో కలవడం జరిగింది. రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలు జనవరి నుండి ప్రారంభం కాబోతున్న సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 25 వేల వరకు ఉన్న ప్రతి ఉద్యోగికి సంక్షేమ పథకాలు వర్తింప చేస్తామని ఎన్నికల్లో భాగంగా ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చినదని, ఆ హామీని నెరవేర్చుకునే దిశగా రాష్ట్రంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రేషన్ కార్డులు వారి తల్లిదండ్రులకు పింఛన్ అమలయ్యే విధంగా జీవో ఇవ్వాలని మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరియు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ను కలసి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు అయ్యే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ను కలిసి గత నెల 28వ తేదీన రాష్ట్రంలోని వైద్యమిత్రాలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా విభాగం నందు ముఖ్య కార్యనిర్వహణ అధికారి సమక్షంలో వైద్య మిత్రల కేడర్ ఫైల్ మరియు జీతాల పెంపు పదవి విరమణ తరువాత పది లక్షలు ఇవ్వాలని, ఉద్యోగి మరణిస్తే ఎక్స్గ్రేషియా కల్పించాలని యూనియన్ నాయకులతో చర్చించటం జరిగిందని మంత్రి దృష్టికి తీసుకెళ్లటం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ. తొందర్లోనే ఫైలు వేగవంతంగా నా వంతు ప్రయత్నం చేస్తానని, మీరు ఇచ్చిన డిమాండ్స్ ను ట్రస్ట్ ఆఫీస్ నుంచి ఫైలు రాగానే వేగవంతం చేసి మీకు న్యాయం చేస్తానని, అదేవిధంగా ఆరోగ్య భీమా లోకి వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నా నేపథ్యంలో రాష్ట్రంలోని వైద్య మిత్రాలు ఆందోళనలో ఉన్నారని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మీ నుండి మాకు భరోసా కల్పించాలని కోరడం జరిగింది. రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ మిత్రలు అందరికీ న్యాయం జరుగుతుందని, ఎటువంటి అపోహలు పడవలసిన అవసరం లేదని మీకు అండగా ప్రభుత్వం ఉంటుందని, మీ అందరికీ జీతాల పెంపు క్యాడరు ఇవన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా న్యాయం చేస్తామని వారు చెప్పటం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఎం.ప్రత్యూష, ఎర్రగొండపాలెం బీజేపీ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎనుముల నాగేశ్వరరావు, మాజీ జెడ్పిటిసి రవికుమార్, మాజీ సర్పంచ్ పాపారావు, రమేష్, ఆశీర్వాదం, తదితరులు పాల్గొన్నారు. (Story :వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ను కలిసిన రాష్ట్ర అధ్యక్షులు మాచర్ల బుజ్జి)