నిరుపేద కుటుంబానికి ఆశ్రయం కల్పించిన
“మీకై.. మేము” బృందం
న్యూస్ తెలుగు /సాలూరు : నిరుపేద కుటుంబానికి ఆశ్రయం కల్పించిన “మీకై.. మేము” బృందం..నిరుపేద కుటుంబానికి నీడనిచ్చిన మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్. వివరాల్లోకి వెళ్తే పార్వతీపురం మన్యం జిల్లా, పాచిపెంట మండల కేంద్రంలో బీసీ కాలనీ సమీపంలో ఉన్న ఎరుకల వీధి సంబంధించిన గొర్లె సంగమ్మ (ఎరుకల) (ST) అను మహిళ ఒంటరిగా జీవిస్తుంది.ఆమె సిమెంట్ ఇటుకలతో ఓ చిన్న గదిని నిర్మించుకున్నది. కానీ దానికి పైకప్పు రేకులు వేయడానికి ఆమెకు స్తోమత సరిపోక మధ్యలోనే వదిలేసారు. వర్షం వచ్చినప్పుడు ఆమె నిత్యవసర సరుకులు,వంట సామాగ్రి తదితర గృహ పరికరాలు వర్షంలో తడిసిపోతున్నాయి.వర్షం పడిన సమయంలో పక్కింట్లోకి వెళ్లి తలదాచుకుంటున్నారు. అంతేకాకుండా ఆమె రిబ్బన్స్,బెలూన్స్, దువ్వెనలు,ఊరు ఊరు తిరిగి అమ్ముకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. ఆ విషయం మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్ సాలూరు వారి దృష్టికి రాగా దాతలు సహాయంతో తనకున్న రెండు గదులకు సరిపడగా రేకులు 20 అడుగులవి 14 వేల రూపాయలు ఖర్చుతో వారికి మీకై..మేము వెల్ఫేర్ అసోసియేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సభ్యులతో పంపిణీ చేయడం జరిగింది అధ్యక్షులు ఇప్పిలి దిలీప్ కుమార్ తెలిపారు .ఈ కార్యక్రమంలో మీకై..మేము బృందం పి.నరేష్ కుమార్, వి.క్రీస్తు రాజు, యడ్ల మహేష్, బుజ్జి, బి.గణపతి పాల్గొన్నారు. (Story : నిరుపేద కుటుంబానికి ఆశ్రయం కల్పించిన “మీకై.. మేము” బృందం)