టెట్ టాపర్స్‌ను అభినందించిన జిల్లా కలెక్టర్
న్యూస్ తెలుగు/ విజయనగరం : టీచర్స్ ఎలిజిబులిటి టెస్ట్ లో అత్యున్నత ప్రతిభ చూపి, రాష్ట్రస్థాయిలో మొదటి, రెండవ ర్యాంకులను సాధించిన విద్యార్ధినులను జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభినందించారు. టెట్‌లో జిల్లాకు చెందిన కోండ్రు అశ్వని 150కి 150 మార్కులను, దాసరి ధనలక్ష్మి 149.99 మార్కులను సాధించి రాష్ట్రస్థాయిలో ప్రధమ, ద్వితీయ స్థానంలో నిలిచారు. అలాగే 149.56 మార్కులను సాధించిన దేవ హారిక మరికొందరితోపాటు తృతీయ స్థానంలో నిలిచారు. ఈ ముగ్గురినీ జిల్లా కలెక్టర్ అంబేద్కర్ తమ ఛాంబర్లో అభినందించారు. ఇదే పట్టుదలతో చదివి ఉపాధ్యాయులుగా ఎంపిక కావాలని, మరింత ఉన్నత స్థానాలను సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యం నాయుడు కూడా పాల్గొన్నారు. (Story : టెట్ టాపర్స్‌ను అభినందించిన జిల్లా కలెక్టర్)