పాండురంగస్వామి దేవాలయ నిర్మాణమునకు
10 లక్షలు విరాళం
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని పి ఆర్ టి సర్కిల్ లో గల శ్రీ పాండురంగ స్వామి దేవాలయంలో నూతన నిర్మాణ కట్టడాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పట్టణంలోని ప్రముఖ వ్యాపారవేత్త, లయన్స్ క్లబ్ సేవకులు, శ్రీనివాస నగర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి సంఘం అధ్యక్షుడు చెన్నం శెట్టి జగదీష్ పది లక్షల రూపాయల విరాళమును ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా పాండురంగ స్వామి ఆలయ కమిటీ వారు చెన్నo శెట్టి జగదీష్ ప్రసాద్ కుటుంబానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియజేశారు. అనంతరం చెన్నం శెట్టి జగదీష్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి తనకున్న ఆదాయంలో కొంత దైవ కార్యాలకు ఉపయోగించినప్పుడే జన్మ సార్థకమవుతుందని తెలిపారు. మానవ సేవ చేయడంలోనూ ఒక మంచి గుర్తింపు ఉందని, అదేవిధంగా దైవ సేవలో ఏదో రూపేనా విరాళం ఇవ్వడం నాకు సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. ఆలయ నిర్మాణానికి తన వంతుగా ఇచ్చానని, ఇంకను ఆలయ నిర్మాణానికి డబ్బు చాలా అవసరం ఉన్నందున, దాతలు స్పందించి ఆలయ నిర్మాణమునకు సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు. (Story : పాండురంగస్వామి దేవాలయ నిర్మాణమునకు 10 లక్షలు విరాళం)